అసలు కాప్చా ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

కాప్చా గురించి ఇంచుమించుగా అందరికీ తెలిసినదే.మనం కొన్ని సైట్లలో సమాచారాన్ని పొందాల్సి వచ్చినపుడు మనకి కొన్ని రకాల కాప్చాలు కనబడుతూ ఉంటాయి.

 Do You Know Why The Original Captcha Is Used , Captcha , Using , Sites , Articl-TeluguStop.com

ఆ టెక్స్ట్ మనం ఎంటర్ చేసిన తరువాతనే సదరు సైట్స్ మనకి అనుమతిని ఇస్తాయి.ఈ క్రమంలో మనకు ఇవి ఎందుకు? అనే అనుమానం తప్పకుండా వస్తుంది.అలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ ఆర్టికల్.ఇపుడు ప్రపంచ మంతటా ఎక్కడ పడితే అక్కడ సైబర్ దాడులు ఎక్కువై పోయాయి. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలపై విరుచుకుపడి తమ ధనాన్ని దోచుకుంటున్నారు.ఈ కోవలోనే రకరకాల కోడింగ్ సాఫ్ట్వేర్లు నిపుణులు సృష్టిస్తున్నారు.

అవును.కొన్ని సంస్థలు వీటిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడుతున్నాయి.

ఇది ముఖ్యంగా IT రంగానికి పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి.మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఇది పెద్ద సవాల్ గా మారిన సంగతి తెలిసినదే.

ఇక ఈ కంప్యూటర్ దాడుల నుంచి బయట కాపాడటానికి కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు.అందులో భాగంగానే ఈ కాప్చా కోడింగ్ ఒకటి.

ఇది మనకు నిత్యం వివిధ సైట్లలో కనపడుతూ ఉంటుంది.

ఈ కాప్చా అంటే ఏమిటంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ ట్యూరింగ్ అన్న మాట.సైబర్ దాడుల నుండి రక్షించుకునేందుకు ఈ కాప్చా పద్ధతిని వినియోగిస్తారు.అంటే ప్రోగ్రామ్ వ్రాసి సైట్ కు సంబంధించిన సెర్వర్ల మీద ఒత్తిడి పెంచేందుకు చేసే దాడుల నుండి తట్టుకునేందుకు ఈ పద్దతిని అనుసరిస్తారు.

ఇందులో వచ్చే టెక్స్ట్ ఇమేజ్ రూపంలో ఉండటం వల్ల ఒక మనిషే చూసి అర్థం చేసుకుని ఎంటర్ చేయాల్సి వుంటుంది.అందువల్ల ప్రోగ్రాం ద్వారా చేసేందుకు వీలవ్వదు.

ఇది జావాస్క్రిప్ట్‌పై పనిచేస్తుంది.స్పామ్ ప్రోగ్రాంలకు జావాస్క్రిప్ట్ ఎక్జిక్యూట్ చేసి, అందులోని అంశాలను చదవటం అసలు సాధ్యమయ్యే పని కాదు.

కాబట్టి ఇది సైబర్ నేరగాళ్ల మీద ప్రభావం చూపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube