సూర్యాపేట జిల్లా:జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్స్ అసిస్టెంట్ లు నూతన సాఫ్ట్ వేర్ పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి సుందరి కిరణ్ కుమార్ తెలిపారు.కంప్యూటర్ ఆపరేటర్ లు ఎదుర్కొటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఆ సంఘం నాయకులు డి.
ఆర్.డి.ఓ.కి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్బంగా డి.ఆర్.డి.ఓ.కిరణ్ కుమార్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బొబ్బిలి సుధీర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస్,ఉపాధ్యక్షులు చెరుకు నాగమణి,సహాయ కార్యదర్శి బి.సరోజ,గౌరవ సలహాదారులు బూర్గుల శ్రీనివాస్,రాష్ట్ర నాయకులు సుంకరి రాకేష్,ఆర్పుల వెంకటేశ్వర్లు,సభ్యులు పి.నాగలక్ష్మి,నందిపాటి నగేష్ తదితరులు పాల్గొన్నారు.