సాధారణంగా స్టార్ హీరోలు క్లాస్ కథలలో నటించడానికి ఇష్టపడరు.ఒకవేళ నటించినా ఆ సినిమాలలో యాక్షన్ సన్నివేశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
అయితే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా మాత్రం యాక్షన్ సన్నివేశాలు లేకుండానే తెరకెక్కింది.ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.ప్రముఖ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు రాధేశ్యామ్ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు.
రాధేశ్యామ్ మూవీ చూశానని ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.ప్రభాస్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ ఎలక్ట్రిఫైయింగ్ గా అనిపించిందని ఆయన తెలిపారు.
ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా క్లైమాక్స్ ఉండనుందని ఆయన చెప్పుకొచ్చారు.
యూనిక్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కిందని ఉమైర్ సంధు కామెంట్లు చేశారు.

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో అదరగొట్టేశాడని రాధేశ్యామ్ సినిమా ఎపిక్ అని ఆయన చెప్పుకొచ్చారు.ప్రభాస్ స్టైల్ ను, క్లాస్ ను బీట్ చేసేవాళ్లు మన దేశంలో ఎవరూ లేరని ఉమైర్ సంధు వెల్లడించారు.తన ట్వీట్ల ద్వారా ఉమైర్ సంధు సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచేశారు.అయితే ఉమైర్ సంధు రివ్యూలు అన్నిసార్లు నిజం కాలేదు.

కొన్నిసార్లు ఫ్లాప్ సినిమాలకు కూడా ఉమైర్ సంధు పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కింది.ఖర్చు విషయంలో రాజీ పడకుండా మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.