బాలయ్య 107వ సినిమా రీమేక్ నా.. క్లారిటీ ఇచ్చేసిన చిత్ర యూనిట్!

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది.

 Makers Clear The Air On Balakrishna's 'nbk107' Movie Storyline, Balakrishna, Go-TeluguStop.com

చాలా రోజుల తర్వాత బాలయ్యకు ఇటు బోయపాటి కి మంచి విజయం దక్కడంతో ఆనందంగా ఉన్నారు.వీరిద్దరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కూడా హిట్ అవ్వడమే కాదు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి.

ఈ సినిమా సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన తర్వాత సినిమా కూడా స్టార్ట్ చేసారు.యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందు కున్నాడు.ఇక ఇప్పుడు ఈ మాస్ వ్యక్తులు ఇద్దరు రంగంలోకి దిగడంతో సినిమా ఎలా ఉండ బోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టారు.అయితే లొకేషన్ ఫోటో లీక్ అవ్వడంతో బాలయ్య లుక్ బయటకు వచ్చింది.దీంతో మేకర్స్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు.ఈ లుక్ రివీల్ అయినప్పటి నుండి ఈ సినిమా కాపీ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

మరి ఈ సినిమా కాపీనా? లేదా ? అనే విషయంపై తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా కన్నడ లో శివరాజ్ కుమార్ చేసిన మఫ్టీ సినిమా రీమేక్ అని వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది.ఈ సినిమా కథ అసలైనది అని మునపటి ఏ చిత్రాల నుండి ప్రేరణ పొందలేదని పేర్కొంది. దీంతో ఈ సినిమా రీమేక్ కాదని స్పష్టం అయ్యింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రలో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.

Makers Clear The Air On Balakrishnas NBK107 Movie Storyline

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube