ఎయిర్ ఇండియా సిబ్బందికి కొత్త రూల్స్ ఇవే..!

ఎయిర్ ఇండియాలో పనిచేసే సిబ్బందికి పలు రకాల సూచనలను జారీ చేసింది.ఎయిర్ ఇండియా సమయ పాలనను మెరుగు పరిచే దిశగా టాటా గ్రూప్‌ చర్యలు మొదలు పెట్టింది.

 Tata Group Air India Staff New Rules Details, Air India, Staff, New Rules, Airpl-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో ఎయిర్ ఇండియాలో పనిచేసే విమాన సిబ్బందికి కొన్ని సూచనలు జారీ చేసింది.మరి ఆ సూచనలు ఏంటో ఒకసారి చూద్దామా.! ఎయిర్ ఇండియాలో పనిచెసే సిబ్బంది పరిమిత సంఖ్యలో మాత్రమే ఆభరణాలు ధరించాలని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది.అలాగే ఎప్పుడయితే ఇమ్మి గ్రేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుందో వెంటనే షాపింగ్‌లు వంటివి చేయొద్దని పేర్కొంది.

అలాగే విధులకు హాజరయ్యే సిబ్బంది తప్పని సరిగా యూనిఫామ్‌ ధరించే విధులకు హాజరు అవ్వాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.అలాగే ఇలా యూనిఫామ్ ధరించడం వలన కస్టమ్స్‌, సెక్యూరిటీ చెక్‌ల వద్ద ఆలస్యం అవ్వకుండా ఉంటుందని తెలిపారు.

అలాగే ఎయిర్ ఇండియాలో పనిచేసే సిబ్బంది నిర్దేశించిన సమయంలోగా భద్రతా తనిఖీలు అన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.అలాగే ఇంకో ముఖ్య మైన విషయం ఏంటంటే ప్రయాణికులు విమానం ఎక్కిన తర్వాత వారు చూస్తుండగా వారి ఎదుట విమాన సిబ్బంది ఆహార పదార్థాలను తినడం గాని, డ్రింక్స్ తాగడం వంటివి చేయకూడదని తెలిపారు.

ఏది అయినా విమానంలోకి ప్రయాణికులు ఎక్కక ముందే చేయాలని ఆదేశాలు జారీ చేసారు.అలాగే విమాన సిబ్బంది ధరించే యూనిఫాం కూడా నీట్ గా ఉండడంతో పాటు చక్కటి గుడ్‌ లుక్‌ ఉండాలని తెలిపారు.వాళ్ళు కనిపించే విధానం బట్టి ప్రయాణికుల్లో సిబ్బంది పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.అయితే టాటా గ్రూప్ తీసుకున్న ఈ నిబంధనలను ఇప్పటికే చాలామంది సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు.

అయితే ఎయిరిండియా యూనియన్ నేతలు మాత్రం ఈ సర్క్యులర్‌లో ఎటువంటి ఇబ్బందికర నిబంధనలు లేవని స్పష్టం చేస్తున్నారు.

Tata Group Air India Staff New Rules Details, Air India, Staff, New Rules, Airplane, Airport, Tata Group, Flight Attendants, Air India Staff, New Rules, Ornaments, Immigration Process, Good Luck, Passangers - Telugu Air India, Air India Staff, Airplane, Airport, Luck, Process, Passangers, Staff, Tata

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube