తెలంగాణ రాజకీయాల్లో కెసీఆర్ ఏం చేసినా ఏదో ఒక చర్చగానే సాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.అయితే కెసీఆర్ కు పీకే టీం సలహాలు ఇస్తుందన్న ఒక ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందన్న విషయం పక్కకు పెడితే దీనిని ఇంకా టీఆర్ఎస్ పార్టీ నేతలెవరూ ధృవీకరించలేదు.అయితే టీఆర్ఎస్ లో మాత్రం పీకే టీం గురించి జోరుగా చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది.
అయితే పీకే టీం సలహాల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్న తరుణంలో కీలక నాయకుల మధ్య చాలా రకాల అంశాలపై చర్చ జరుగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది.
అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగనున్న నేపథ్యంలో పార్టీలు చాలా వేగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అంతగా తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేదు కాబట్టి కెసీఆర్ కు ఎన్నికల్లో విజయం సాధించడం చాలా సులభమైంది అని చెప్పవచ్చు.కాని ఈసారి మాత్రం పోరు హోరా హోరీగా ఉండనుంది కాబట్టి చాలా వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తేనే కాస్త ఫలితాలు కాస్త ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది.
అందులో భాగంగానే టీఆర్ఎస్ పీకే టీంతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఎంత మేరకు కీలక పాత్ర పోషించనుంది అనే విషయంపై ఇప్పుడే ఖచ్చితంగా ఒక అవగాహనకు మాత్రం రాలేకపోయినా పీకే టీం సలహాలే కీలక పాత్ర పోషిస్తాయనేది మాత్రం సుస్పష్టం.మరి ఇప్పటి వరకు తెలంగాణలో పీకే టీం ఎటువంటి పాత్ర పోషించకపోయినా మరి రానున్న రోజుల్లో ఎలా వ్యవహరిస్తుందనేది చూడాల్సి ఉంది.