పీఆర్సీఫై ప్రభుత్వంతో జరిగిన చర్చలపై స్పందించిన ఉద్యోగ సంఘాల నేతలు..

అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దెందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసింది.

 Prc Sadhana Samithi Members Response On Meeting With Ap Govt Details, Prc Sadhan-TeluguStop.com

అనుమానాలు నివృత్తి తో పాటు కొన్ని సర్దుబాటు చేశాం.కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.

చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నాం.మళ్ళీ కలిసి పనీ చేస్తాం.

బండి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.చర్చలు జరిగినా ఇంకా చాలా అంశాల్లో స్పష్ఠత రావాల్సి ఉంది.

ఇవాళ రేపు మా ఆందోళన కొనసాగుతుంది.చర్చలు సానుకూలంగానే జరిగాయని చెప్పగలం.

పీఆర్సీ సాధన సమితి కె.ఆర్.సూర్యనారాయణ మాట్లాడుతూ.పీఆర్సీ సంబంధించిన ఉద్యోగ సంఘాలు ఇచ్చిన అంశాలపై పూర్తి స్ధాయి కమిటీ తో చర్చించాం.

కొన్ని అంశాల్లో ఆర్ధిక శాఖ అధికారులు కొంత వివరణ ఇవ్వాల్సి ఉంది.ఉదయం 10 గంటలకు మంత్రుల కమిటీ, మధ్యాహ్నం మళ్ళీ ఉద్యోగ సంఘాల తో చర్చ ఉంటుంది.

చర్చలు జరిగినా ఇంకా పూర్తి ఫలితం రాని కారణంగా మా పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుంది.మంత్రుల కమిటీ తో చర్చలు సానుకూలంగా నే జరిగాయి.

బొప్పరాజు మాట్లాడుతూ.చర్చలు సానుకూలంగా నే జరిగాయి.

నిన్న చలో విజయవాడలో ఉద్యోగుల ఆకాంక్షలు, ఆవేదన చర్చల్లో స్పష్టం గా కనిపించింది.కొన్ని అంశాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

పూర్తి స్థాయిలో అంశాలపై దేనిపైనా స్పష్టత రాకపోవడంతో నే మా ఆందోళన యధావిధిగా కొనసాగుతుంది.

Prc Sadhana Samithi Members Response On Meeting With Ap Govt Details, Prc Sadhana Samithi Members, Response ,meeting With Ap Govt, Ap Prc Issues, Sajjala Ramakrishna Reddy, Bopparaju, Kr Surya Narayana, Bandi Srinivas - Telugu Ap Prc, Bandi Srinivas, Bopparaju, Kr Surya Yana, Ap, Prcsadhana, Response

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube