ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే.సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ రికార్డులను తిరగ రాస్తోంది.
అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.ఇందులో ప్రతి సీన్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుంది.
అందుకే ఈ సినిమా నేషనల్ వైడ్ గా మేనియా చూపిస్తోంది.బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తోంది.
ఇక స్టార్ క్రికెటర్లు కూడా పుష్పరాజ్ తగ్గేదే లే డైలాగ్‌ను తెగ చెప్పేస్తున్నారు.అన్ని దేశాల క్రికెటర్లు ఈ డైలాగ్‌ను చెప్తూ.
శ్రీవల్లి స్టెప్‌ను వేసేయడంతో ఈ మూవీకి ఎక్కడ లేని హైప్ వచ్చేస్తోంది.
ఈ మూవీ ఐకాన్ స్టార్ కెరీర్ లోనే ఓ మైలు రాయిలా నిలిచిపోయింది.కేవలం బాలీవుడ్‌లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.ఇక ఇందులో బన్నీ యాక్టింగ్ అయితే అందరి ప్రశంసలు అందుకుంటోంది.ఇందులో బన్నీ మేనరిజం, లుక్ అయితే అందరినీ ఫిదా చేస్తోంది.కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ ఏదో ఒక వార్త నెట్టింట్లో వినిపిస్తూనే ఉంది.అయితే ఇప్పుడు కూడా పుష్ప కు సంబంధించిన వార్త ఒకటి బాగా పాపులర్ అవుతోంది.
అయితే ఇది ఒక ఆటో గురించి.ఈ వైరల్ పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.
పుష్ప మూవీలో అల్లు అర్జున్ తన ఎడమ చేతిని కొంచెం ఎత్తినట్టు పెట్టుకోవడం మనకు తెలిసిందే.అది ఆయన శారీరక వైకల్యం ఉన్న పాత్ర అని తెలుస్తోంది.అయితే ఇప్పుడు ఒక ఆటో కూడా ఇలాగే ఒక వైపు ఎత్తుగా ఉండి కనిపిస్తోంది.దాని వెనకాల ‘పుష్ప ఆటో’ అని రాసి ఉంది.ఇంకేముంది దాన్ని చూసిన వారంతా కూడా పుష్ప రాజ్ మేనియా ఆఖరకు ఆటోకు కూడా పట్టుకుంది అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.ఇక ఈ ఆటో ఇప్పుడు బాగా పాపులర్ అయిపోతోంది.
చూసిన వారంతా కూడా ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు షేర్ చేస్తున్నారు.