నెట్టింట్లో నిత్యం ఎన్నో రకాల వార్తలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే ఇలా వైరల్ అయ్యే వాటిల్లో చాలా వరకు జంతువులకు సంబంధించినవే ఉంటాయి.
ఎందకంటే జంతువులకు సంబంధించినవి మనుషులు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు కాబోలు.వాటికి వ్యూయర్ షిప్ తో పాటు, లైకులు, కామెంట్లు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంటాయి.
అయితే ఇలా వచ్చే వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాల్లో నెటిజన్లు షేర్ చేస్తూనే ఉంటారు.అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే పాపులర్ అవుతోంది.
ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా.అవి పెద్దగా వైరల్ అయ్యేవి కావు.అయితే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం నిత్యం ఏదో ఒక వీడియో బాగానే పాపులర్ అవుతోంది.ఇక సరీ సృపాలకు సంబంధించిన వీడియోల గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.
అందులోనూ ఈ మధ్య కొండ చిలువలకు సంబంధించిన వీడియోలు బాగా హల్ చల్ చేస్తున్నాయి.ఇక ఇప్పుడు ఓ కొండ చిలువ చేసిన పని అందరినీ వణికిస్తోంది.
దాని రూపం చూసేందుకు కూడా అత్యంత భయంకరంగా ఉంటుంది కదూ.
ఇక ఇప్పుడు ఓ 58సెకన్ల వీడియోను చూస్తే గనక వెన్నులో వణుకు పుట్టాల్సిందే.ఇందులో దాదాపు 8 అడుగుల వరకు పొడవుతో భారీగా ఉంది.ఇది ఇందులో ఓ గోడ అంచున భయంకరంగా పాకుతూ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది.
దీన్ని చూసేందుకు కూడా చాలా భయంకరంగా ఉంటుంది.చూసేందుకు కాకుండా వణుకు పుట్టే విధంగానే ఉంది.
ఇక పైనున్న పిల్లి దాన్ని చూసి కొంచెం అటు ఇటుగా ఆలోచించి, దానితో మనం పోరాడలేములే అనుకుని వెను దిరిగిపోతుంది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా పాపులర్ అవుతోంది.