సినిమా రంగానికి చెందిన స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లలో పెళ్లి చేసుకోని హీరోలు, హీరోయిన్ల గురించి ఎప్పుడూ ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది.కొందరు హీరోలు, హీరోయిన్లు తమకు పెళ్లిపై ఆసక్తి లేదని బహిరంగంగా చెబుతుంటే మరి కొందరు మాత్రం సినిమా ఆఫర్లు తగ్గిన తర్వాత లేదా కొన్నేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటామని బహిరంగంగా చెబుతున్నారు.16 సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ ట్యాగ్ తో కేరీర్ ను కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు తమన్నా కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.మరో రెండు సంవత్సరాల పాటు పెళ్లి గురించి తనకు ఆలోచన లేదని తమన్నా అన్నారు.2020 సంవత్సరం అక్టోబర్ నెల 30వ తేదీన కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగింది.కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే.కాజల్, తమన్నా మంచి స్నేహితులు కాగా తమన్నా మాత్రం పెళ్లిపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం ఎవరితో డేటింగ్ లో లేరు.అయితే గతంలో తమన్నా పెళ్లి దిశగా అడుగులు వేశారు.కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.తెలుగులో ఎఫ్3, భోళాశంకర్ సినిమాలలో తమన్నా నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలతో పాటు గుర్తుందా శీతాకాలం సినిమాలో తమన్నా నటిస్తున్నారు.
గని సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేయగా ఆ సినిమా కూడా త్వరలో రిలీజ్ కానుంది.
వరుసగా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో తమన్నా పెళ్లి దృష్టి పెట్టడం లేదని సమాచారం.
కథ నచ్చితే వెబ్ మూవీలకు కూడా మిల్కీ బ్యూటీ ఓకే చెబుతున్నారు.కన్నడలో ఒక పాన్ ఇండియా మూవీకి కూడా తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది.