బంగార్రాజు దర్శకుడిని చెడామడా తిట్టిన నాగార్జున.. ఏం జరిగిందంటే?

బంగార్రాజు సినిమాతో కళ్యాణ్ కృష్ణ కురసాల ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.నేల టికెట్ ఫలితంతో నిరాశ చెందిన కళ్యాణ్ కృష్ణ తక్కువ సమయంలోనే తెరకెక్కించినా బంగార్రాజు సినిమా విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

 Nagarjuna Angry On Bangarraju Director Why Because , Angry On, Bangarraju Direct-TeluguStop.com

అయితే ఈ దర్శకుడు తాజాగా ఒక టాక్ షోలో మాట్లాడుతూ నాగార్జున తనను చెడామడా తిట్టేశాడని చెప్పారు.రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సమయంలో తాను కొంతమంది తప్పులను కవర్ చేయాలని ప్రయత్నించానని కళ్యాణ్ కృష్ణ అన్నారు.

ఈ విషయం నాగార్జునకు తెలియడంతో అవతలి వ్యక్తుల తప్పులను ఎన్ని రోజులు కవర్ చేస్తావ్.ఇలా తప్పులను కవర్ చేయడం వల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుంది కదా అని నాగ్ అన్నారని కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు.

బంగార్రాజు సినిమాను ఎప్పుడు తెరకెక్కించినా సంక్రాంతికే విడుదల చేయాలని భావించామని చాలా సంవత్సరాల క్రితమే ఈ సినిమా కథను నాగార్జునకు చెప్పానని కళ్యాణ్ కృష్ణ అన్నారు.

సినీ కెరీర్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా కళ్యాణ్ కృష్ణ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

చిన్నప్పుడు నటుడు కావాలని అనుకున్నానని ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని దర్శకుడిని అయ్యానని కళ్యాణ్ కృష్ణ వెల్లడించారు.పీజీ చదివిన తర్వాత సినిమాల్లోకి తాను ఎంట్రీ ఇచ్చానని కళ్యాణ్ కృష్ణ కామెంట్లు చేశారు.

నేల టికెట్ సినిమా మిస్ ఫైర్ అయిందని ఆ సినిమాను తాను సరిగ్గా చూపించలేకపోయానని కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు.

చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించాలని తాను కోరుకుంటున్నానని కళ్యాణ్ కృష్ణ కామెంట్లు చేశారు.కాలేజ్ లో చదువుకునే సమయంలో తాను చిన్నగా ఉండేవాడినని తనను అందరూ చైల్డ్ ఆర్టిస్ట్ అని పిలిచేవారని కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు.నాగార్జునకు బంగార్రాజు సినిమా కథ చెప్పగానే ఈ సినిమా పర్ఫెక్ట్ సీక్వెల్ అవుతుందని చెప్పారని కళ్యాణ్ కృష్ణ కామెంట్లు చేశారు.

Nagarjuna Angry On Bangarraju Director Why Because , Angry On, Bangarraju Director, Interesting Facts , Nagarjuna - Telugu Angry, Bangarraju, Nagarjuna

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube