ఎవరు ఏ పని చేసినా.నాలుగు రాళ్లు వెనక్కి వేసుకోవడానికే.
ఇందుకు కోసం కొందరు తెగ కష్టపడుతుంటారు.మరికొందరు చిత్రవిచిత్రమైన ఉద్యోగాలు, పనులు చేస్తూ రెండు చేతులతో సంపాదిస్తుంటారు.
జెస్సికా స్ట్రీక్ అనే అమ్మాయి కూడా విచిత్రంగా మంత్రగత్తెనని చెప్పుకుంటూ వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులు ఆర్జిస్తుంది.ఇక్కడ విచిత్రమేంటంటే.
ఇందుకోసం ఓ యూనివర్సిటీలో కోర్సు చేసి పట్టా కూడా పుచ్చుకుందంటా.
జెస్సికాకు ఇన్‌స్టాగ్రాంలో 10వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉంటే.టిక్‌టాక్‌లో ఏకంగా 6.30లక్షల మందిపైగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది.జెస్సికా పెట్టే మంత్రాల పోస్టులు, చిత్ర విచిత్ర వీడియోలకు ఆమె ఫాలోవర్స్‌లో క్రేజీ ఉంది.వీటిని ఆమె ఫ్యాన్స్ తెగ చూస్తుంటారు.దీంతో ఆమెకు డబ్బులు కూడా వస్తున్నాయి.ఇలా చేసి జెస్సికా రెండు చేతులతో సంపాదిస్తుంది.
మంత్రగత్తె వృత్తికి సంబంధించి డైలీస్టార్ వెబ్సైట్ ఓసారి ఆమెను ప్రశ్నించింది.దీంతో జెస్సికా ఇలా బదులిచ్చింది.‘‘ నేను ఓసారి చేసిన మంత్రాల ఫొటోలు, వీడియోలను సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను.అయితే నేను ఊహించినదాని కంటే మంచి రెస్పాన్స్ రావడంతో దీన్నే ఫుల్‌టైమ్ జాబ్‌గా చేస్తున్నాను.
’’ అని జెస్సికా చెప్పుకొచ్చింది.దీంతో ఆమెకు భవిష్యత్తుపై బెంగ లేకుండా ఒకపక్క డబ్బు… మరోపక్క సెలబ్రిటి హోదా దక్కింది.
జెస్సికా వీడియోలను నెటిజన్లు ప్రధానంగా ఇష్టపడటానికి ఓ కారణం ఉంది.ఆమె పోస్ట్ చేసిన వీడియోలు నవ్వు తెప్పించేవిధంగా ఉండడమే.
అందులోనూ ఆమె మిమిక్రీ కూడా చేస్తుంది.కొన్నిసార్లు అమాయకురాలిలా నటిస్తూ.
చిత్రమైన పనులు చేస్తూ చిక్కుల్లో పడుతుంది.దీంతో ఆమె వీడియోలకు సోషల్ మీడియాలో భలే డిమాండ్ ఉంటుంది.
అలాగే జెస్సికా తన వీడియోల్లో చిత్రవిచిత్రమైన వస్తువులు, వింత కళ్లు, రకరకాల వస్తువులు, ఎముకల్లా ఉంటే కర్రలు.రంగురంగుల పూసలు కనిపిస్తుంటాయి.
కొంచ్చెం భయపడేటట్లు.మరికొంత ఫన్ ఉండడంతో ఈ వీడియోలకు ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువే.
మంత్రాలతో ఏదైనా చెయ్యడం అంటే తనకు చాలా ఇష్టమని జెస్సికా చెప్పుకొచ్చింది.