సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నాయి.కృష్ణ తన సినిమా వల్ల నిర్మాతకు నష్టం వస్తే ఆ నిర్మాతను ఆదుకునే విషయంలో ముందుండేవారు.
సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.మొత్తం 31 సినిమాలు ఈ కాంబినేషన్ లో తెరకెక్కడం గమనార్హం.
ఎక్కువ సినిమాలలో కలిసి నటించడంతో ఈ జోడీకి కూడా మంచి పేరు వచ్చింది.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో మామాఅల్లుళ్ల సవాల్ సినిమా కూడా ఒకటి కాగా ఈ సినిమాలో కృష్ణకు అక్కగా జమున నటించారు.
కైకాల సత్యనారాయణ జమున భర్త పాత్రను పోషించగా అక్క కూతురి పాత్రలో శ్రీదేవి నటించారు.ఒక నిర్మాతను ఇంటివాడిని చేయాలనే ఆలోచనతో ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన కృష్ణ, శ్రీదేవి తమ రెమ్యునరేషన్లను తగ్గించుకొని ఈ మూవీలో నటించడం గమనార్హం.
ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జమునతో పాటు డైరెక్టర్ కే.ఎస్.ఆర్ దాస్ కూడా తమ రెమ్యునరేషన్లను తగ్గించుకున్నారు. కుదరవల్లి సీతారామస్వామి అనే వ్యక్తి కైకాల సత్యనారాయణతో నాపేరే భగవాన్ అనే సినిమాను నిర్మించారు.
అయితే ఆ సినిమా సక్సెస్ సాధించినా నిర్మాతకు మాత్రం డబ్బులు రాలేదు.అయితే ఈ నిర్మాతకు ఊరిలో ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉండేది.
సత్యనారాయణ ఈ విషయాన్ని కృష్ణకు చెప్పగా కృష్ణ మంచి హృదయంతో తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.సగం పారితోషికంతో కృష్ణ ఈ సినిమాలో నటించడం గమనార్హం.
శ్రీదేవి కూడా సగం రెమ్యునరేషన్ తో ఈ సినిమాలో నటించారు.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నిర్మాత మంచి భవంతిని కట్టుకోవడంతో పాటు అమ్ముకున్న పొలాన్ని కూడా కొన్నారు.