నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేస్తున్న షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’.ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో నందమూరి బాలకృష్ణ షో ఒకటి.ఆయన ఎనెర్జీ కి అభిమానులంతా ఎంతగానో త్రిల్ అవుతున్నారు.ఈ షోకు తాజాగా పుష్పరాజ్ పుష్ప టీమ్ తో కలిసి ఈ వేదికపై ఫన్ చేయడానికి విచ్చేశాడు.
నెక్స్ట్ ఎపిసోడ్ కోసం బాలయ్య టాక్ షో లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు, గ్లామర్ బ్యూటీ రష్మిక మందన, దర్శకుడు సుకుమార్ కలిసి బాలయ్య షోలో హాజరయ్యారు.ఈ షోలో కూడా పుష్ప టీమ్ తమ మ్యానరిజమ్స్ తో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఈ షోని కూడా డామినేట్ చేసారు.
ఇక షోలో పుష్పరాజ్ సందడి చేయబోతున్నాడు అని తెలిసినప్పటి నుండి అభిమానులంతా ఎంతగానో ఎదురు చూసారు.
బాలయ్యను, బన్నీని ఒకే వేదికపై చూసేందుకు అభిమానులు ఇష్టపడుతున్నారు.ఇక ఈ షోలో బాలయ్య, అల్లు అర్జున్ కలిసి సుకుమార్ ను ఒక ఆట ఆడుకున్నారు.వీరిద్దరూ సుకుమార్ పై పంచుల వర్షం కురిపించారు.ఈ ఎపిసోడ్ లో ఇది అందరిని బాగా ఆకట్టుకుంది.సుకుమార్ కన్ఫ్యూజన్ తన పెద్ద బలహీనత అని చెప్పుకొచ్చాడు.వెంటనే బాలయ్య ఈ విషయంపై సుకుమార్ పై సెటైర్ వేసేశాడు.
సుకుమార్ అలా చెప్పగానే బాలయ్య మాట్లాడుతూ తనకు తగినంత క్లారిటీ ఉందని.
తనతో సినిమా చేస్తే మూడు నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయగలడని పంచ్ వేసాడు బాలయ్య.ఆ తర్వాత అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పుష్ప 2 తర్వాత తాను, సుకుమార్ సినిమా చేస్తున్నామని, కేవలం మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేస్తామని బాలయ్య తెలిపాడు.
అల్లు అర్జున్ వెంటనే చిరునవ్వుతో బదులిస్తూ.సుకుమార్ గందరగోళానికి ముగింపు పలికేందుకు మీలాంటి నటులు ఆయనతో కలిసి పని చేయాలని అన్నారు.దీంతో బాలయ్య త్వరలోనే సుకుమార్ తో తాను చేయబోయే సినిమాను దసరాకు స్టార్ట్ చేసి క్రిస్మస్ నాటికీ పూర్తి చేస్తానని అన్నారు.అంతేకాదు ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది అని చెప్పుకొచ్చారు.
ఈ ఎపిసోడ్ లో రష్మిక బాలయ్య తో కలిసి కూడా స్టెప్పులు వేసి అదరగొట్టింది.