నిరుద్యోగ దీక్ష వేదికగా కెసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అధ్యక్షతన ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయాలంటూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.అయితే నిరుద్యోగులు ఉద్యోగం రాలేదనే ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాని ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేయకుండా నిరుద్యోగులు ఆందోళనకు గురయ్యేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.

 Bandi Sanjay Fire On Kcr As A Platform For Unemployment Initiation Details, Kcr,-TeluguStop.com

ఎట్టకేలకు బీజేపీ కార్యాలయంలో చేపట్టిన దీక్షకు తెలంగాణ రాష్ట్ర భాజపా ఇంచార్జీ తరుణ్ చుగ్  పాల్గొన్నారు.ప్రభుత్వం ఎంతగా ఆంక్షలు విధించినా మెజారిటీ నేతలు నిరుద్యోగ దీక్షకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఈ సందర్భంగా బండి సంజయ్ కేసీఆర్ పై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు.కరోనా నిబంధనలకు అనుగుణంగా దీక్ష చేపడుతుంటే ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బంది ఏంటని నిరుద్యోగుల ఆత్మహత్యలు కేసీఆర్ కళ్ళకు కనిపిస్తలేవా అంటూ బండి సంజయ్ కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంతగా ప్రభుత్వం ఆంక్షలు విధించినా నిరుద్యోగుల రాకను ప్రభుత్వం నిలువరించడం చాలా కష్టమని నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేసే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదని బండి సంజయ్ అభిప్రాయ పడ్డారు.

Telugu @cm_kcr, Bandisanjay, Bjp, Cm Kcr, Etela Rajender, Telangana, Tharun Chug

ఈ దీక్షకు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ విజయ శాంతి మిగతా రాష్ట్ర స్థాయి బీజేపీ ముఖ్య నేతలు, నిరుద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.ఇంకా ఇప్పుడిప్పుడే అందరూ దీక్ష స్థలికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం ఈ దీక్షపై సోషల్ మీడియా టీఆర్ఎస్ నేతలు బీజేపీకి కౌంటర్ లు విసురుతున్నారు.

దేశంలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రంగా అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube