బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 కంటెస్టెంట్ మానస్ కు ఆ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ లో మానస్ టాప్ 4 కంటెస్టెంట్ గా నిలిచారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాలలో మానస్ నటించగా బుల్లితెరపై కూడా మానస్ సత్తా చాటారు.సోషల్ మీడియాలో కూడా మానస్ కు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
మెచ్యూర్డ్ థింకింగ్ తో మానస్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మిగతా కంటెస్టెంట్లతో కూడా మానస్ ఫ్రెండ్లీగా ఉన్నారు.
మానస్ తల్లి పద్మిని హోం టూర్ ద్వారా ఇంటికి సంబంధించిన ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.మానస్ నటుడిగా సంపాదించిన డబ్బులతోనే ఇంటిని కొన్నామని ఆమె చెప్పారు.
మానస్ చిన్న వయస్సులోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతులమీదుగా నంది అవార్డును అందుకున్నాడని పద్మిని వెల్లడించారు.సోషల్ మీడియాలో ఇస్మార్ట్ మలయజ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు.
మానస్ కు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చినందుకు సంతోషంగా ఉందని మానస్ నాన్న తెలిపారు.
మానస్ తల్లి తనకు మొక్కలు అంటే చాలా ఇష్టమని ఈ హౌస్ ట్రిపుల్ బెడ్ రూమ్ హౌస్ అని తెలిపారు.మానస్ కు ఒకేచోట ఎక్కువ వస్తువులు ఉంటే నచ్చవని పద్మిని అన్నారు.నరసింహ నాయుడు, అర్జున్ సినిమాలలో మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడని పద్మిని చెప్పుకొచ్చారు.
మానస్ స్టోరీ డిస్కషన్ రూమ్ ను, బాల్కనీ, ఇతర గదులను పద్మిని వీడియోలో చూపించారు.
మానస్ తల్లి మానస్ చిన్నప్పటి ఫోటోలను చూపించారు.చిన్నప్పుడు ఆడపిల్లను దత్తత తీసుకుందామని అనుకున్నామని కానీ కొన్ని కారణాల వల్ల తీసుకోలేదని మానస్ తల్లి అన్నారు.దేవుని గది, బెడ్ రూమ్, ఇతర గదులను ఆమె చూపించారు.
మానస్ ఇల్లు చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.