పదవులు ఉన్నా ప్రయోజనం నిల్ ? మారని టి కాంగ్రెస్ నేతలు ?

అన్నీ ఉన్నా ఏదో అన్నట్లుగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి.పార్టీకి బలమైన కేడర్ ఉన్నా,  వారిని సరైన రీతిలో నడిపించడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ కాలేకపోతోంది.

 Elangana Congress Leaders Do Not Care About The Party Situation Telangana, Congr-TeluguStop.com

తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో చక్రం తిప్పాల్సి ఉన్నా,  కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.అధికార పార్టీ టిఆర్ఎస్, కేంద్ర అధికార పార్టీ బీజేపీని తెలంగాణలో ఎదుర్కోవడం పెద్ద సవాల్ గా మారింది.

టిఆర్ఎస్ తర్వాత బలమైన పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నా,  ఇప్పుడు ఆ స్థానాన్ని బిజెపి ఆక్రమించింది.నిత్యం ప్రజా పోరాటాలు,  ఉద్యమాలతో బీజేపీ జనంలోకి వెళ్తున్నా,  తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి లో మార్పు రావడంలేదు.

చెప్పుకోవడానికి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చాలామంది ఉన్నా,  వారి వల్ల ఉపయోగం లేదు అన్నట్లుగా వ్యవహారం ఉంది.నాయకులు గ్రూపు రాజకీయాల్లో మునిగి తేలుతూ,  పార్టీ పరిస్థితిని పాతాళానికి తొక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ కు ఊపు తీసుకొచ్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున అధికార ప్రతినిధులను నియమించారు.వారి ద్వారా కాంగ్రెస్ ను జనాల్లోకి తీసుకు వెళ్ళ వచ్చని,  వారు పార్టీ కి సంబంధించి బలమైన వాయిస్ వినిపిస్తారని రేవంత్ భావించారు.

ఈ నేపథ్యంలోనే కీలకమైన వారందరికీ ఆ జాబితాలో చోటు కల్పించారు.సీనియర్ అధికార ప్రతినిధులు,  అధికార ప్రతినిధులు అని ప్రత్యేక హోదా లు కూడా కల్పించారు.

అయితే వారు ఎవరు పెద్దగా యాక్టిివ్ గా లేకపోవడం,  కాంగ్రెస్ తరఫున వాయిస్ వినిపించకపోవడంతోనే కాంగ్రెస్ పరిస్థితి మొదటికి వచ్చింది.తెలంగాణలో ఎన్నో సమస్యలు నెలకొన్న, వాటిపై కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరు నాయకులు తప్పించి మిగతా నాయకులంతా స్పందించకపోవడం వంటి వ్యవహారాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

  రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి కొంతమంది నాయకులు తప్ప , మిగతా నాయకులు సైలెంట్ గానే ఉండి పోతున్నారు.ఈ తరహా వ్యవహారాలు కాంగ్రెస్ పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి అనే ఆందోళన కాంగ్రెస్ అభిమానుల్లో నెలకొంది.

Telugu Congress, Congress Senior, Congress Spoke, Revanth Reddy, Telangana, Tpcc

పిసిసి పెద్దలు సైతం అధికార ప్రతినిధులు విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తు ఉండడం తో,   ఏ అంశాలపై జనాల్లోకి వెళ్ళాలి,  పార్టీ తరపున వాయిస్ వినిపించాలి వంటివి దిశా నిర్దేశం చేసే వారు కరువవడం , ఇలా అనేక కారణాలతో తెలంగాణలో కాంగ్రెస్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.పార్టీ క్యాడర్ ఉన్న వారు సరైన విధంగా ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ పెద్దలు విఫలమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube