తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఎంటర్టైన్మెంట్ షోలలో ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ షో కూడా ఒకటి.ఈ షో కి యాంకర్ గా సుమ వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే సుమ యాంకరింగ్ విషయానికి వస్తే ఆమె చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఇట్టే కలిసిపోతూ,టకటకా మాట్లాడేస్తూ ఉంటుంది.అందువల్లే ఈవెంట్ జరిగినా, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా, ఆడియో ఫంక్షన్స్ లో అయినా ప్రతి ఒక్క చోట కూడా సుమ కనిపిస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న క్యాష్ షో కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.
ఇందులో దేవతా సీరియల్ అర్జున్ తన భార్య సురేఖతో కలిసి వచ్చాడు.
అలాగే లాస్య – మంజునాథ్, శివ జ్యోతి – గంగోలి, రోహిత్ – మెరీనా జంటలు కలసి సందడి చేశారు.ఈ క్రమంలోనే అర్జున్, తన భార్య సురేఖతో కలసి ఎంట్రీ ఇవ్వగా.
ఎంట్రీలోనే అర్జున్ కి షాక్ ఇచ్చింది సుమ.నువ్వు తొడగొట్టే భర్తవా? లేక భార్య కొంగు చాటు భర్తవా? అని సుమ అర్జున్ ని ప్రశ్నించగా.భార్య తొడగొట్టే భర్తను అంటూ అర్జున్ సమాధానం ఇవ్వడంతో సుమా ఒక్కసారిగా అవాక్కయ్యింది.దీనితో సురేఖ ఒక్కసారిగా పళ్ళుమని నవ్వేసింది.
వెంటనే సుమ ఇప్పుడు ఆ పని నువ్వు చెయ్యాలి అని ఆర్డర్ వేయగా సురేఖ కంగారుపడి వద్దు అనేసింది.అలా ఎంట్రీ లోనే సుమ ఆ జంటను ఇరికించేసింది .దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేవత ఫేమ్ అర్జున్ విషయానికి వస్తే.
మొదట బుల్లితెర యాంకర్ గా ట్రై చేశాడు.అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి మొదటగా అర్జున్ యాంకరింగ్ చేశాడు.
అది వర్కౌట్ కాకపోవడంతో ఆ తర్వాత సుధీర్ యాంకరింగ్ చేశారు.అలాగే హీరోయిన్ పూర్ణ నటించిన సుందరి సినిమాలో అర్జున్ హీరోగా నటించాడు.
ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు.ఇందులో దేవత, అగ్ని సాక్షి లాంటి సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు.