వామ్మో.. ఈ పెద్దాయ‌న డ్యాన్స్ చూస్తే పొట్ట చెక్క‌ల‌వ్వాల్సిందే..

ప్రస్తుతం సోషల్ మీడియా మేనియా నడుస్తోంది.ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి.

 Old Man Dance On Saat Samundar Paar Song Video Goes Viral On Social Media, Old M-TeluguStop.com

కొన్ని నవ్వు తెప్పిస్తే.మరికొన్ని ఆసక్తిగాను, ఇంకొన్ని ఫన్నిగా‌ను ఉంటాయి.

చాలా మంది తమలో దాగున్న ప్రతిభను సోషల్ మీడియా వేదికగా వ్యక్త పర్చుతుంటారు.ఈ వీడియోలకు లైక్స్, షేర్ చేస్తూ ప్రోత్సహిస్తుంటే వారు మురిసిపోతుంటారు.

తాజాగా ఓ వృద్ధుడు చేసిన డ్యాన్స్‌ వైరల్‌గా మారింది.ఈ వీడియోకి మిలియన్ల కొద్ది వ్యూస్‌, లైక్స్ వచ్చాయి.

నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు.ఓ పెళ్లి వేడుకలో హిందీ సాంగ్ ‘సాత్ సమందర్ పార్’ ప్లే అవుతుండగా.

ఈ పాటకి ఓ వృద్దుడు చేసిన డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.ఒకసారి అతని డ్యాన్స్ చూస్తే.

గతంలో అతను కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడన్న అనుభూతి కలగక మానదు.

చాలా శ్రద్ధగా, పద్ధతిగా స్టైలిష్‌గా స్టెప్స్ వేసి అందర్నీ అశ్చర్య పర్చాడు.

ఆ వృద్ధుడి వయస్సు కనీసం 70 ఏళ్లు  ఉంటుంది.అయితే అయన వేసిన డ్యాన్స్ చూస్తే.20 ఏళ్ల కుర్రవాడిని తలపిస్తుంది.ఈ వీడియో నెటిజన్ల మనసు దోచింది.

దీంతో ఈ వృద్ధుడి డ్యాన్స్‌ను మళ్లీ మళ్లీ చూస్తూ తెగ ఆనందిస్తున్నారు నెటిజన్లు. డెభై  ఏళ్ల వయసు లోనూ ఇరవై ఏళ్ల కుర్రవాడిలా డ్యాన్స్‌ చేయడం అతడికే చెల్లిందని అభినందిస్తున్నారు.

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని.అది ఏదో ఒక రోజు బయటకు రావాల్సిందే.

ఈ వృద్దుడి విషయంలో కూడా అదే జరిగింది.ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

నెటిజన్లు లైకులు, షేర్లు, ఫన్నీ కామెంట్లుతో సోషల్ మీడియా లో హోరెత్తిస్తున్నారు.ఒక వేళా మీరు ఈ వీడియో చూడకపోతే.

ఓసారి చూసి వృద్ధుడి డ్యాన్స్‌ను మెచ్చు కోవాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube