బిగ్ బాస్ సీజన్ 5 లో ఈ ఆదివారం హౌజ్ మెట్స్ తో ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు.ఈ క్రమంలో మానస్ తో ప్రియాంకా సింగ్ మాట్లాడింది.
నువ్వు హౌజ్ లో నన్ను భరించావా అని అడిగింది ప్రియాంకా.ఇక మరోపక్క షణ్ముఖ్, సిరిలను జెస్సీ షాకింగ్ ప్రశ్నలు వేశాడు.
నీకు సిరిల మధ్య హౌజ్ లో ఉన్న రిలేషన్ బయటకు ఎలా వెళ్తుందని అనుకుంటున్నావ్ అని అడిగాడు.అంతేకాదు సిరిని కూడా నువ్వు చేస్తున్న పనుల వల్ల నువ్వే కన్ ఫ్యూజన్ తో పిచ్చెక్కిపోతుందని అన్నాడు.
హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిల ఫ్రెండ్ గా వారి గ్రూప్ లో ఉన్న జెస్సీ ఇలా సడెన్ గా ఆడియెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా ప్రశ్నలు అడగడం అందరిని సర్ ప్రైజ్ చేసింది.అఫ్కోర్స్ ఆడియెన్స్ కి కూడా షణ్ముఖ్, సిరిల రిలేషన్ గురించి ఇలాంటి ప్రశ్నలే ఉన్నాయి.
సిరిని కంట్రోల్ చేయడమే తన ఆటగా పెట్టుకున్నాడు షణ్ముఖ్.అందుకే ఫ్రెండ్ అయినా సరే జెస్సీ ఆ ప్రశ్నలు అడిగాడని అంటున్నారు.
మరి వీటికి షణ్ముఖ్, సిరిలు ఎలా సమాధానం ఇచ్చారన్నది చూడాలి.