కార్తీకదీపం టీవీ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఆడ -మగ,చిన్న – పెద్ద, సామాన్యులు – సెలబ్రిటీలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్తీక దీపం సీరియల్ చూస్తారు అనడంలో ఎటువంటి అతియోశక్తి కాదు.
అందుకే కార్తీక దీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.ఎప్పుడెప్పుడు కార్తీకదీపం సీరియల్ వచ్చే సమయం అవుతుందా.
తరువాత సీరియల్ లో ఏమవుతుంది అన్న ఆత్రుత ప్రేక్షకుల్లో కనిపిస్తుంది.
టీఆర్‌పీ రేటింగ్ విషయంలో షోలు, సీరియళ్ల కంటే ఈ సీరియల్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్‌తో ఈ సీరియల్ దూసుకుపోతోంది.తెలుగు ప్రేక్షకుల్లో ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
కార్తీకదీపం సీరియల్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు వంటలక్క, డాక్టర్ బాబు.వీరిద్దరికీ బుల్లితెరపై బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
కార్తీకదీపం సీరియల్ లో ఈ వంటలక్క డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.అయితే ప్రేక్షకులు కోరుకున్న విధంగానే వంటలక్క డాక్టర్ బాబు కలిసి పోయినప్పటికీ, వారి మధ్య ఏదో ఒక విషయంలో దూరం పెరుగుతూనే ఉంది.విలన్ మోనిత వేసే ప్రతి ఒక్క ప్లాన్ కి డాక్టర్ బాబు వంటలక్క బలవుతున్నారు.అయితే ఈ సీరియల్ పై రాను రాను ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి.ఈ సీరియల్ ని ఇప్పట్లో ఆపేసే ఉద్దేశం లేదా అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఇందులో వంటలక్క డాక్టర్ బాబు కలిసి ఉండలేరు.కలవరు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.