త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు ప్ర‌జాదీవెన యాత్ర‌.. ప్లాన్ ఫ‌లిస్తుందా..?

దేశవ్యాప్తంగా ఒకరకమైన రాజకీయాలు నడుస్తుంటే ఏపీలో మాత్రం వింత పాలిటిక్స్ నడుస్తున్నాయి.ఒక రకంగా చెప్పుకోవాలంటే రీవెంజ్ పాలిటిక్స్ అనుకోవచ్చు.

 Chandrababu Prajadivena Yatra Soon .. Will The Plan Work .., Chandrababu, Tdp-TeluguStop.com

ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై చర్చించాల్సిన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిపై, అతని ఫ్యామిలీ మెంబర్స్ పై అధికార పార్టీ నేతలు కామెంట్స్ చేయడం ఇంతవరకు ఎక్కడా లేదు.దీంతో ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు వెంటనే అసెంబ్లీలో శపథం చేసి మరీ బయటకు వచ్చారు.

మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే ఈ హౌస్‌లో అడుగుపెడతానని సవాల్ విసిరారు.ఆ తర్వాత జరిగిన ప్రెస్‌మీట్‌లో బాబు గుక్కపట్టి ఏడ్వడం అందరినీ కదలించింది.

ఈ టైంలో అందరూ సీఎం జగన్‌ను ఆ పార్టీ లీడర్లను తెగ తిట్టుకున్నారు.

అయితే, చంద్రబాబు ఒక సామాన్య వక్తి కాదు, మూడుసార్లు ముఖ్యమంత్రి, ఏడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయన సొంతం.

కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి.వైఎస్ హయాంలో ప్రతిపక్షనాయకుడిగా పనిచేసిన బాబు, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక కూడా ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు.

తనకంటే తక్కువ అనుభవం కలిగిన సీఎం, తన పార్టీలో నుంచి వెళ్లి వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లతో మాటలు పడటం చంద్రబాబుకు కంటగింపుగా మారింది.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Ysrcp-Telugu Political News

గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ కూడా ఇలానే శపథం చేసి సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెట్టారు.

నాటి సీఎం చంద్రబాబు జగన్ ను ఆ పార్టీ నేతలను ఎంతగా ఇబ్బంది పెట్టారో ఎవరూ మర్చిపోలేనట్టు ఉంది.నిన్న రోజ కూడా అదే విషయాన్నిగుర్తుచేసింది.

అయితే, జగన్ ప్రజల్లోకి వెళ్లి సుధీర్ఘ పాదయాత్ర ద్వారా అధికారంలోకి రాగా, ప్రస్తుతం చంద్రబాబు కూడా అలానే చేయాలని ఆలోచిస్తున్నారట… ‘ప్రజాదీవెన’పేరిట పాదయాత్ర చేపట్టి జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలని చూస్తున్నారట.కానీ ఈ ఏజ్‌లో పాదయాత్ర సాధ్యమవుతుందా అని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పాదయాత్ర కుదరకపోతే బస్సు యాత్రైనా చేపడతారని తెలుస్తోంది.అయితే, ప్రజల నుంచి ఆశించినంత ప్రజాధారణ వస్తుందా? రాదా.అనేదానిపై పలు సందేహాలున్నాయి.వైసీపీ అభివృద్ధి మంత్రం ముందు చంద్రబాబు శపథం నేరవేరుతుందా? లేదా అనేది వేచిచూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube