టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా గురించి మన అందరికి తెలిసిందే.ఈమె ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన జిల్ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.ఈ అందాల రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూనే ఉంటారు.
అలా తన అందంతో కుర్రకారుకి పిచ్చేకిస్తూ ఉంటుంది.అయితే రాశీ ఖన్నా ఇప్పుడిప్పుడే కెరీర్ లో మెల్లిగా స్పీడందుకుంటోంది.
బాలీవుడ్ లో కూడా అవకాశాలతో దూసుకుపోతోంది.ఇప్పటికే హిందీలో షాహిద్ హీరోగా ‘సన్నీ’ హీరోగా అజయ్ దేవగన్ ‘రుద్ర’ అనే రెండు వెబ్ సిరీస్ లో నటించింది.
రాశీ ఖన్నా ప్రస్తుతం ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాలీవుడ్ సిని వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో యాక్షన్ ఫ్రాంచైజీ రూపొందనున్న విషయం తెలిసిందే.
ఇందులో ఒక లీడ్ క్యారెక్టర్ కి రాశి ఖన్నా అవకాశం దక్కించుకుంది అని బాలీవుడ్ సిని వర్గాల్లో వార్తలు కోడై కూస్తున్నాయి.
ఫ్రాంచైజీ అంటే కొన్ని భాగాలుగా సినిమాని తీస్తారని తెలిసిందే.ఒకవేళ ఈ సినిమాలో రాశీ కమిట్ అయిన వార్త నిజమే అయితే బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లే.సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ఇతర ప్రధాన తారాగణంగా కనిపించే ఈ యాక్షన్ ఫ్రాంచైజీకి యోధ అనే టైటిల్‌ను అనుకుంటునట్లు సమాచారం.
పుష్కర్ ఓజా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని బీ టౌన్ ఖబర్.ఇక సౌత్‌లో గోపీచంద్ పక్కా కమర్షియల్,నాగచైతన్య థ్యాంక్యూ’,కార్తీ సర్దార్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.