పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ నుండి మరో పాట రాబోతుంది.దీపావళి సందర్బంగా లాల భీమ్లా పాటను విడుదల చేయబోతున్నట్లుగా గ్లిమ్స్ విడుదల చేశారు.
ఆహా అనిపించేలా ఉన్న ఆ గ్లిమ్స్ తో సినిమాపై మరియు రేపు రాబోతున్న పాటపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఈమద్య కాలంలో వచ్చిన పాటలు అన్నింటి రికార్డులను బ్రేక్ చేసే విధంగా లాల భీమ్లా పాట కు యూట్యూబ్ రికార్డులు నమోదు కాబోతున్నట్లుగా అభిమానులు ధీమాగా చెబుతున్నారు.
పాటకు అత్యంత తక్కువ సమయంలోనే లక్ష లైక్స్ మరియు మిలియన్ వ్యూస్ ను ఇచ్చేందుకు అభిమానులు పెద్ద యుద్దమే చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.రికార్డు బ్రేకింగ్ వ్యూస్ కోసం లాల భీమ్లా రెడీ అయ్యింది.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సాదారణంగానే మాస్ బీట్స్ ను ఓ రేంజ్ లో కొట్టేస్తాడు.అలాంటిది పవన్ కోసం మాస్ బీట్స్ అంటే ఆయన మరో రేంజ్ లో సినిమాను తీసుకు వెళ్లేలా కొడతాను అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తో వరుసగా రెండవ సినిమా ను చేస్తున్న థమన్ ఈ పాటతో మరో రెండు మూడు సినిమా లను పవన్ నుండి అందుకునేలా ట్యూన్ చేశాడు అంటున్నారు.
థమన్ మాస్ ట్యూన్ కు పవన్ మాస్ అప్పీల్ అదనంగా యాడ్ అయితే అద్బుతం అన్నట్లుగా ఉంటుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.పెద్ద ఎత్తున ఈ పాట పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఆహా ఓహో అన్నట్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు టార్గెట్ గా రాబోతున్న భీమ్లా నాయక్ సినిమా లో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటించిన విషయం తెల్సిందే.
రానా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే.