సినిమా రంగంలోకి ఎంతోమంది హీరోయిన్లు, నటీమణులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.అయితే ఆయా హీరోయిన్లు, నటీమణులలో కొంతమంది మాత్రమే ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటూ ఉంటారు.
అలా జై భీమ్ సినిమాలో నటించి తన పాత్ర ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చిన్నతల్లి పాత్రలో అద్భుతంగా నటించి లిజోమోల్ జోస్ ఆకట్టుకున్నారు.తమిళనాడు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రు రియల్ లైఫ్ ఆధారంగా జై భీమ్ సినిమా తెరకెక్కింది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైన జై భీమ్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.ఈ సినిమాలో భర్త ఆచూకీ తెలుసుకోవడం కోసం పోరాటం చేసే గిరిజన మహిళగా లిజోమోల్ జోస్ నటించారు.
కేరళలోని అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన లిజోమోల్ జోస్ అమెరికన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేశారు.
లిజోమోల్ జోస్ కు ఒక సోదరి ఉన్నారు.డిగ్రీ పూర్తైన తర్వాత లిజోమోల్ జోస్ కొన్ని నెలల పాటు ఒక టీవీ ఛానల్ లో పని చేశారు.ఆ తర్వాత లిజో ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్ లో పాండిచ్చేరి యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు.
మహేశింటే ప్రతీకారం సినిమాలో లిజోకు తొలి ఛాన్స్ దక్కగా ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో హీరో కావడం గమనార్హం.మలయాళ మూవీ రిత్విక్ రోషన్ లిజోకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది.
హనీ బీ 2.5 సినిమాతో నటిగా ఆమె కెరీర్ లో మరో మెట్టు పైకి ఎదిగారు.ఒరేయ్ బామ్మర్ది అనే సినిమాలో లిజో హీరోయిన్ గా నటించడం గమనార్హం.చినతల్లి పాత్ర కోసం లిజో తనను తాను పూర్తిగా మార్చుకున్నారు.ఆ పాత్ర గురించి లిజో చెబుతూ కొన్ని సీన్లలో తాను గ్లిజరిన్ లేకుండా నటించానని దర్శకుడు కట్ చెప్పినా తనకు కన్నీళ్లు ఆగలేదని ఆమె అన్నారు.జై భీమ్ మూవీని ఎన్నిసార్లు చూసినా తనకు ఏడుపు వస్తుందని లిజో పేర్కొన్నారు.