కరోన మహమ్మారి కారణంగా గడిచిన కొంత కాలంగా అమెరికాలోకి వలస వాసుల ఎంట్రీ పై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.ఈ కారణంగా ఎంతో మంది వలస వాసులు వారి వారి దేశాలలోనే ఉండిపోయారు.
తాజగా ఈ ఆంక్షలు ఎత్తేసిన నేపధ్యంలో నవంబర్ 8 నుంచీ వలస వాసులు ఎవరైనా సరే తమ దేశంలోకి అడుగు పెట్టచ్చని అమెరికా కీలక ప్రకటన చేయడంతో ఏడాదిగా వేచి చూస్తున్న వలస వాసులకు భారీ ఊరట లభించింది.దాంతో భారతీయ వలస వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు నవంబర్ 8 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.
అయితే ఈ తరుణంలో భారత్ లోని అమెరికన్ ఎంబసీ షాకింగ్ న్యూస్ ప్రకటించింది.
భారత్ నుంచీ అమెరికా వెళ్ళే వలస వాసులు మరి కొంత కాలం వేచి ఉండాలని, ముఖ్యంగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ వారు వీసా అపాయింట్మెంట్ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపింది.
దాంతో ఒక్క సారిగా వలస వాసులు షాక్ కి గురయ్యారు.అమెరికా ప్రయాణం అందరికి సులభంగా అవ్వడానికి తాము కృషి చేస్తున్నామని వీసాల జారీ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుందని, రెండు దేశాల మధ్య సంభంధాలు మరింతగా బలపడేలా చేయడమే తమ లక్ష్యమని ఎంబసీ తెలిపింది.
కరోనా కారణంగా కలిగిన సమస్యలు ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ చేస్తున్నామని ఈ నేపధ్యంలోనే రాయబార, కాన్సులేట్ కార్యాలయాలలో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఈ ప్రక్రియను మరింత వేగంగా చేసేందుకు అదే సమయంలో దరఖాస్తు దారులు, సిబ్బందికి ఎలాంటి అభద్రతా భావం లేకుండా పరిస్థితులు కల్పిస్తామని తెలిపింది.తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రకారం భారత్ నుంచీ దాదాపు 30 లక్షల మంది భారతీయులు అమెరికా ప్రయాణం చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.
ఇక అమెరికా విధించిన నిభంధనల ప్రకారమే ఎంట్రీ ఉంటుందని, ఈ విషయాలు దరఖాస్తు దారులు తప్పకుండా తెలుసుకోవాలని సూచించింది.