ప.గో జిల్లా: ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా అరెస్ట్.ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రెస్ మీట్.బుట్టాయిగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు.
ఏలేటి చంద్ర శేఖర్, లాగు శ్రీను, పాపదాసు రమేష్ రెడ్డి, దోరేపల్లి మధు శేఖర్, శింగలూరు సురేష్, సిద్ధాని నాగరాజు అనే నింధితులు అరెస్ట్.
వారి వద్ధ నుంచి 1,50,000 అసలు నోట్లు, 12,00,000 నకిలీ నోట్లు, 3 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్ లు స్వాధీనం.
జంగారెడ్డిగూడెం, పోలవరం ప్రాంతాల్లో దొంగనోట్ల చెలామణి చేస్తున్నట్లు పోలీసు విచారణ తేటతెల్లం.నింధితుల పై 489B, 489C, r/w 34 IPC యాక్ట్ లపై కేసు నమోదుచేసిన పోలీసులు.
ఇటువంటి ఫేక్ కరెన్సీ విషయాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మా.
ప్రెస్ మీట్ లో పోలవరం డీఎస్పీ లలిత కుమారి, పోలవరం సిఐ ఎఎన్ఎన్ మూర్తి, ఎస్సై ఎ.జయబాబు మరియు బుట్టాయిగూడెం పోలీసులు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.