ఏపీలో బలపడేందుకు ఇప్పుడు బీజేపీ ఎంతలా ప్రయత్నిస్తుందో తెలియనిది కాదు.అదే క్రమంలో మళ్లీ అధికారంలోకి రావడానికి కూడా చంద్రబాబు అండ్ పార్టీ బాగానే ప్రయత్నిస్తోంది.
ఇలా ఇరు పార్టీలు ఒకటి అధికారం కోసం మరొకటి బలపడటం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఇందుకోసం అందివచ్చిన ప్రతి అంశాన్ని బాగానే వినియోగించుకుంటున్నాయి.
అయితే రెండు పార్టీలు వేరు వేరుగానే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్పుడు టీడీపీ బీజేపీ మద్దతు కోసం ఎంతలా ప్రయత్నిస్తుందో కూడా చూస్తున్నాం.
గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకునే అధికారంలోకి వచ్చింది.అయితే 2019 ఎన్నికల్లో బీజేపీని వ్యతిరేకించడంతో ఒంటరి అయిపోయింది.ఇక దారుణంగా ఓడిపోవడంతో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు.ఇదే సమయంలో పవన్ తో పొత్తు పెట్టుకుని బలపడేందుకు బీజేపీ ఎంతలా ప్రయత్నిస్తున్నా పెద్దగా కలిసి రావట్లేదు.
దీంతో మళ్లీ బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ బాగానే రాయబారాలు నడిపిస్తోంది.అయితే ఒక ప్రచారం ఇప్పుడు బాగా వినిపిస్తోంది.
ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గనక మెజార్టీ స్థానాలను ఆశించే ఛాన్స్ ఉందంటున్నారు.
యాభైకి పైగా ఎమ్మెల్యే సీట్లు, అలాగే 13 వరకు ఎంపీ సీట్లను కోరే ఛాన్స్ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.ఈ షరతులకు ఒప్పుకుంటే గనక టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది.ఇదే విషయం మీద ఇప్పడు టీడీపీలో పెద్ద చర్చ నడుస్తోంది.
ఒక రకంగా అంత ఇవ్వకపోయినా కూడా మెజార్టీ సీట్లను టీడీపీ వదులుకునేందుకు సిద్ధంగానే ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.అదే జరిగితే టీడీపీ నేతలకు తీవ్ర అన్యాయమే జరుగుతుంది.
మరి చంద్రబాబు పొత్తు కోసం అంత పెద్ద త్యాగాలు చేస్తారా అన్నది సందేహమే.
.