లాంగ్ వెకేషన్ కు యంగ్ టైగర్.. ఏ దేశానికి వెళుతున్నారో మీకు తెలుసా?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలు పూర్తైన వెంటనే లాంగ్ వెకేషన్ పై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో కష్టపడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ తో బిజీగా ఉండటం వల్ల ఇన్నిరోజులు లాంగ్ వెకేషన్ పై దృష్టి పెట్టలేదు.

 Young Tiger Ntr Is Planning A Long Vacation With His Family Details, Long Vacat-TeluguStop.com

తాజాగా ఈ షో షూటింగ్ కంప్లీట్ కావడం డిసెంబర్ 2వ తేదీ వరకు ప్రసారం కావాల్సిన ఎపిసోడ్ల షూటింగ్ పూర్తి కావడంతో తారక్ లాంగ్ వెకేషన్ పై దృష్టి పెట్టారు.

ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి లాంగ్ వెకేషన్ కు వెళ్లనున్నారని సమాచారం.

మరోవైపు ఎన్టీఆర్ నటించిన సినిమా విడుదలై మూడేళ్లు పూర్తి కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా త్వరగా రిలీజైతే బాగుంటుందని అనుకుంటున్నారు.డిసెంబర్ నెలలో కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండటంతో పాటు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తో ఎన్టీఆర్ బిజీ కానున్నారనే విషయం తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ మాల్దీవ్స్ కు వెళుతున్నారని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది చెబుతుండగా మాల్దీవ్స్ కాదని మరో దేశమని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

Telugu Egypt, Koratala Siva, Long, Meeloevaru, Ntr, Ntr Long, Tollywood-Movie

మరోవైపు కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ ఎన్నారైగా కనిపిస్తారని వార్తలు వస్తుండగా ఈ సినిమా కోసం తారక్ ఈజిఫ్ట్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది.మరోవైపు ఫస్ట్ సీజన్ ను అద్భుతంగా హోస్ట్ చేసిన ఎన్టీఆర్ సెకండ్ సీజన్ ను హోస్ట్ చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని సమాచారం.

Telugu Egypt, Koratala Siva, Long, Meeloevaru, Ntr, Ntr Long, Tollywood-Movie

మరోవైపు తారక్ భార్య లక్ష్మీప్రణతి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండరనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి 42 రోజుల షెడ్యూల్ ఈజిఫ్ట్ లో జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి రకరకాల టైటిల్స్ ప్రచారంలో వస్తుండగా ఏ టైటిల్ ను సినిమాకు ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube