1.కెనడా నూతన రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ
కెనడా నూతన రక్షణ మంత్రిగా భారత సంతతికి చెందిన అనిత ఆనంద్ నియమితులయ్యారు.
2.సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి
సింగపూర్ తెలుగు సమాజం , తిరుమల తిరుపతి దేవస్థానం , శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ , పీజీ కళాశాల తెలుగు విభాగం, మలేషియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు.
3.వారంలోనే 662 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ
గల్ఫ్ దేశం కువైట్ లో గత కొంతకాలంగా చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న ప్రవాసులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే .గడిచిన వారం రోజుల్లోనే ఏకంగా 662 మందికి పైగా ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టినట్టు అక్కడి అధికారులు తెలిపారు.
4.చైనా ఏకపక్ష నిర్ణయం పై భారత్ ఆగ్రహం
చైనా ఆమోదించిన కొత్త భూ సరిహద్దు చట్టంపై భారత విదేశాంగ స్పందించింది.చైనా ది ఏకపక్ష నిర్ణయం అంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
5.ఆఫ్గాన్ లో 450 మంది అమెరికన్లు
అమెరికా పౌరులు ఇంకా దాదాపు 450 మంది ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్నట్టు పెంటగాన్ ప్రకటించింది.
6.పెగసెస్ పై స్వాతంత్ర నిపుణుల కమిటీ
భారత్ లో ప్రకంపనలు సృష్టించిన పెగాసెస్ స్పైవేర్ తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
7.సీజనల్ ఇన్ఫెక్షన్ గా కొవిడ్ -19
ఉష్ణోగ్రత తేమ తగ్గినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ గా కోవిడ్ 19 ఉండవచ్చునని, దానికి తగిన ఆధారాలు ఉన్నాయని స్పెయిన్ లోని బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.
8.ఐక్యరాజ్యసమితి పై ఉత్తర కొరియా ఆగ్రహం
కరోనా కట్టడికి తాము తీసుకున్న చర్యలను మానవహక్కుల ఉల్లంఘనగా ఐక్యరాజ్యసమితి పేర్కొనడం పై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.దీనంతటికీ అమెరికానే కారణం అని వ్యాఖ్యానించింది.
9.షాపింగ్ మాల్ లో కాల్పులు : ఇద్దరి మృతి
అమెరికాలోని ఇదహౌలో షాపింగ్ మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారు.
10.ఆఫ్గాన్ నుంచి అమెరికాకు ముప్పు
అగ్రరాజ్యం అమెరికాకు అఫ్గాన్ నుంచి ఉగ్ర ముప్పు ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.