నేటితో హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనున్న విషయం తెలిసిందే.దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇక గెలుపు కొరకు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇక ముప్పై తారీఖున ఎన్నిక జరగనున్న తరుణంలో ఇప్పటికే గెలవడానికి అవకాశం ఉన్న పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎలక్షనీరింగ్ పై దృష్టి పెట్టాయి.ఇక నేటితో ప్రచారం ముగుస్తున్న తరుణంలో ఇక అన్ని పార్టీలు ఇక పకడ్భందీగా ప్రచారాన్ని ముగించాలని యోచిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే టీఆర్ఎస్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని, డబ్బులు పంపిణీ చేస్తోందని బీజేపీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న పరిస్థితి ఉంది.బీజేపీ చేస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ స్పందించిన పరిస్థితి లేదు.
అంతేకాక ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య భీకర పోటీ ఉండబోతోందని, కాంగ్రెస్ మూడో స్థానంలో ఉండబోతోందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ డబ్బుల పంపిణీపై రకరకాల వీడియోలు వైరల్ గా మారుతున్న పరిస్థితి ఉంది.
దీంతో బీజేపీ ఇదే అదునుగా టీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపిస్తూ టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచేందుకు శక్తికి మించి కృషి చేస్తోన్న పరిస్థితి ఉంది.
అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉందా అని ఇంతలా హుజూరాబాద్ లో జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించడం లేదని వీహెచ్ మండి పడ్డారు.అయితే వీహెచ్, బీజేపీ వ్యాఖ్యలపై ఎవరూ స్పందించడం లేదు.ఏది ఏమైనా గెలుపు కొరకు అన్ని పార్టీలు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది.
మరి రానున్న రోజుల్లో హుజూరాబాద్ లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.