టాలీవుడ్ డైరెక్టర్లలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా రాజమౌళి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.రాజమౌళి కొడుకు కార్తికేయ దాదాపు రెండు సంవత్సరాల క్రితం పూజ అనే యువతిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.2019 సంవత్సరం డిసెంబర్ నెల 29వ తేదీన జైపూర్ ప్యాలెస్ లో కార్తికేయ పూజల వివాహం జరిగింది.దసరా పండుగ సందర్భంగా ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ జోడీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
పూజతో సంవత్సరం పాటు స్నేహం చేశానని ఆ తర్వాత పూజకు తాను ప్రపోజ్ చేశానని కార్తికేయ అన్నారు.పూజ పాడే పాటలు తనకు ఇష్టమని కార్తికేయ చెప్పుకొచ్చారు.
కాలేజ్ లో చదువుకునే రోజుల్లో తాను ఐస్ క్రీమ్ పార్లర్ లో పని చేశానని కిక్ కోసం ఆ నిర్ణయం తీసుకున్నానని కార్తికేయ పేర్కొన్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొడక్షన్ పనులు చూసుకున్నానని ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మార్కెటింగ్ చేస్తున్నానని కార్తికేయ అన్నారు.
వింటర్ వెడ్డింగ్ కావాలనుకుని చలికాలం పెళ్లి చేసుకున్నానని 10 డిగ్రీల చలిలో పెళ్లి జరిగిందని కార్తికేయ తెలిపారు.

పూజ మాట్లాడుతూ రాజమౌళికి పాలు, కాఫీ, టీ నచ్చవని పెరుగన్నంలో స్వీట్ తింటారని చెప్పుకొచ్చారు.రోడ్డు ఖాళీగా ఉన్నా రాజమౌళి వాహనాన్ని నిదానంగానే డ్రైవ్ చేస్తారని ఆమె అన్నారు.బాల్యంలో సినిమావాళ్లను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నానని కార్తికేయ అడిగిన సమయంలో కూడా ఆలోచించానని పూజ అన్నారు.

తాను సంప్రదాయ సంగీతం నేర్చుకుంటున్నానని కెమెరా ముందుకు వెళితే తాను నెర్వస్ అవుతానని పూజ అన్నారు.అమ్మ దగ్గర హార్డ్ వర్క్ నేర్చుకున్నానని అత్తయ్య రమా రాజమౌళి దగ్గర నెగటివ్ ఫీల్ ఉంచుకోకపోవడం నేర్చుకున్నానని పూజ పేర్కొన్నారు.మా పెళ్లికి ముందు రాజమౌళి ఏ విధంగా ఉన్నారో పెళ్లి తర్వాత కూడా అదే విధంగా ఉన్నారని పూజ చెప్పుకొచ్చారు.