టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, ప్రొడ్యూసర్ గా విజయశాంతి మంచి పేరును సొంతం చేసుకోవడంతో పాటు ఎక్కువ విజయాలను అందుకున్నారు.తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా విజయశాంతి నటించగా ఆ సినిమాలు కూడా సక్సెస్ సాధించడంతో ఇతర భాషల్లో కూడా విజయశాంతికి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నారు.
సౌత్ ఇండియాలో విజయశాంతిని అభిమానులు ప్రేమగా లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు.
సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో నటించలేదు.
తాజాగా విజయశాంతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లోకి రీఎంట్రీకి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా విజయశాంతి క్రేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.180కు పైగా సినిమాలతో మూడు దశాబ్దాల పాటు నటిగా విజయశాంతి కెరీర్ ను కొనసాగించారు.
అయితే నటిగా వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే విజయశాంతి రాజకీయాలతో బిజీ అయ్యారు.
13 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాలోని భారతి పాత్ర మంచిపేరు తెచ్చిపెట్టింది.విజయశాంతి కోసమే ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఎంతోమంది ఉన్నారు.భవిష్యత్తులో తనకు ఒక్క యాక్షన్ సినిమాలో నటించాలని ఉందని విజయశాంతి కామెంట్లు చేశారు.
రొటీన్ సినిమాలలో నటించడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని విజయశాంతి వెల్లడించడం గమనార్హం.దర్శకులు మంచి యాక్షన్ కథతో వస్తే ఒక సినిమాలో నటించడానికి తనకు అభ్యంతరం లేదని విజయశాంతి కామెంట్లు చేశారు.విజయశాంతితో యాక్షన్ సినిమాను తెరకెక్కించే దర్శకుడు ఎవరో చూడాల్సి ఉంది.
విజయశాంతి కొత్త తరహా కథాంశాలపై ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.విజయశాంతి ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తానని చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.