మినీ జిమ్, బార్ ఉన్న కారును మీరెప్పుడైనా చూశారా..

మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టు టెక్నాల‌జీని ఉప‌యోగించుకుని కంపెనీలు స‌రికొత్త విజ‌న్‌తో ఉత్ప‌త్తులు చేస్తున్నాయి.ఇక కార్ల విష‌యానికి వ‌స్తే మాత్రం రోజుకో కొత్త ర‌కం కార్ల‌తో ప్ర‌జ‌ల‌ను మెస్మ‌రైజ్ చేస్తూనే ఉన్నారు.

 Have You Ever Seen A Car With A Mini Gym And A Bar Mini Gym, Electric Car , Vira-TeluguStop.com

ఇక ఇప్పుడు ఫ్రాన్స్‌కు చెందిన ఓ కార్ల కంపెనీ చేసిన ప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉంద‌నే చెప్పాలి.ఎందుకంటే ఈ సిట్రోన్‌ కంపెనీ త‌యారు చేసి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు అంద‌రినీ షాక్ కు గురి చేస్తోంది.

ఇప్పుడున్న స‌మాజంలో మ‌నుషుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే వాటిని అందులో రూపొందించింది.కాగా ఈ కారుకు స్కేట్ అని పేరు కూడా పెట్టింది కార్ల కంపెనీ.

ఈ స్కేట్ కారును అన్ని రకాలుగా అనుకూలంగా త‌యారు చేసింది కంపెనీ.ఇక ఈ ఆక‌రు అయితే పేరుకు తగ్గ‌ట్టే స్కేటింగ్‌ బోర్డులా చాలా స్మార్ట్ గా ఉంది.

దీన్ని ఆడ్ చేసుకోవ‌డానికి మూడు బాడీలు కూడా సెప‌రేట్‌గా అమ‌ర్చి ఉంటాయి.ఇక కార్లోనే హోటల్‌ తరహాలో హాయిగా రెస్ట్ తీసుకోవ‌డానికి కారులో ఉన్నామ‌నే ఫీలింగ్ రాకుండా ఉండేందుకు సోఫా కూడా ఉంటుంది.

అంతే కాదండోయ్ హాయిగా ఎంజాయ్ చేసేందుకు మినీ బార్‌తో నిండి ఉండే ఒక పాడ్ కూడా అందుబాటులో ఉంటుంది.ఇక దీనితో పాటు వ్యాయామం చేసేందుకు మినీ జిమ్ కూడా ప‌రిక‌రాల‌తో రెడీగా ఉంటుంది.

Telugu Electric Car, France, Board, Gym, Resaurt, Electri Car, Fitness Pad-Lates

దీన్నిపవర్‌ ఫిట్‌నెస్ పాడ్ గా పిలుస్తారు.ఇక మూడో పాడ్ వ‌చ్చేసి సగం క్యాబిన్ ఉంటే మిగతా సగం ఏమో ఓపెన్‌ స్పేస్‌ ఉండే సిటిజన్‌ ప్రొవైడర్ లాగా ఎంతో అంద‌మైన పాడ్‌ తో ఉంటుంది.ఇక చాలా వ‌స‌తులు క‌లిగిన ఈ ఎల‌క్ట్రిక్ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చు.ఇంకో విష‌యం ఏంటంటే ఈ పాడ్‌లలో ప్ర‌తి దాన్ని కూడా కేవ‌లం పది సెకన్లలోనే మార్చుకుని వాడుకోవ‌చ్చ‌న్న‌మాట‌.

ఇక హాయిగా కారులో వెళ్తూ అద్దాల్లోంచి చూసేందుకు ఓపెన్‌ టాప్ కూడా ఏర్పాటు చేశారు.ఇందులో ఒక మినీ రిసార్ట్ ఉంద‌నే చెప్పాలి.వైన్‌ తాగుతూ వెళ్లాలనుకుంటే దీన్ని మించిన వీలైన కారు మ‌రోటి ఉండ‌దేమో అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube