ఎక్స్‌పోజ్ చెయ్యాలిగా.. ఆ మాత్రం ఇచ్చుకోలేరా: ఇలియానా అగ్లీ కోరికలు

కొన్ని కొన్ని సమయాలలో హీరోయిన్స్ పారితోషకం విషయంలో ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు.పాత్రకు తగ్గట్టుగా పారితోషకంను వసూలు చేసుకుంటారు.

 Ileana Pays The Price For Her Starry Tantrums Ileana, Tollywood, Heroine, Film I-TeluguStop.com

ఇక కొన్ని సమయాలలో పాత్రలలో కాస్త ఎక్స్పోజింగ్ లాంటివి ఉంటే మాత్రం మరింత పారితోషకం డిమాండ్ చేస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే ఇలియానా కూడా పారితోషికం విషయంలో బాగా అగ్లీ కోరికలు కోరింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా నిలిచిన గోవా బ్యూటీ ఇలియానా గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.కానీ మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీ నుండి దూరం అవ్వాల్సి వచ్చింది.

మొదట దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత వరుసగా అవకాశాలతో తన ఖాతా నింపుకుంది.

అలా స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకుని వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.ఒక్క ఏడాదికే వరుస సినిమాలతో స్టార్ హీరోలతో పోటీగా నిలిచింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ గా అందర్నీ ఆకట్టుకుంది.తన నడుము అందాలతో నడుము సుందరి గా పేరు సంపాదించుకుంది.ఇక మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో అనుకోకుండా శరీర సైజును పెంచి అందరికీ షాక్ అయ్యేలా చేసింది.పైగా ఆ సమయంలో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కూడా నటించింది.

కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

Telugu Expose, Ileana, Srinu Vitla, Tollywood-Movie

ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినీ ఇండస్ట్రీకి దూరమైంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టగా అక్కడ కూడా అంత సక్సెస్ కాలేకపోయింది.ఇక మళ్లీ సినిమాలలో అడుగు పెట్టడానికి మునుపటిలా తయారు కావడానికి బాగా కష్టపడింది.

జిమ్ములో సమయాన్ని ఎక్కువ గడుపుతూ తెగ వర్కౌట్లు చేసింది.అంతేకాకుండా డైట్ ఫుడ్ కూడా తీసుకుంది.

Telugu Expose, Ileana, Srinu Vitla, Tollywood-Movie

అలా మొత్తానికి శరీరాన్ని తగ్గించుకొని మునుపటి లా తయారయింది.ఇక గ్లామర్ డోస్ ను పెంచి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.అంతేకాకుండా ఓ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే గతంలో ఈమె కాస్త అగ్లీ గా ప్రవర్తించిందని తెలిసింది.2009లో డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సినిమాకు మొదట ఇలియానాకు అవకాశం వచ్చిందట.

Telugu Expose, Ileana, Srinu Vitla, Tollywood-Movie

ఇక శ్రీను వైట్ల డేట్ కన్ఫామ్ కోసం ఆమె దగ్గరికి వెళ్లగా ఆమె చాలా మిస్ బిహేవియర్ చేసిందట.తనకు ముందు అనుకున్న పారితోషకం సరిపోదని సినిమాల్లో ఇంకాస్త ఎక్స్ పోజ్ చేయాల్సి ఉందన్నారు కాబట్టి ఎక్స్ ట్రా రెమ్యూనరేషన్ కావాలని గట్టిగా పట్టుబడిందట.ఆ తర్వాత శ్రీను వైట్ల మళ్లీ ఫోన్ లో కాంటాక్ట్ అయ్యాడట.

ఇక తన తల్లి కూడా సినిమాలో ఎక్కువ ఎక్స్పోజింగ్ ఉందని అన్నారు కాబట్టి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే ఇవ్వాలని అనడంతో తన తల్లి మాటనే ఫైనల్ అని చెప్పిందట ఇలియానా.

అంతేకాకుండా డేట్స్ విషయంలో క్యాన్సిల్ చేసుకోమని వేరే నిర్మాణ సంస్థ వాళ్లు తనను ఆ డేట్స్ అడుగుతున్నారని చెప్పిందట.

ఈ విషయాన్ని శ్రీను వైట్ల హీరో వెంకటేష్ తో చెప్పడంతో వేరే హీరోయిన్ చూసుకోమని సలహా ఇచ్చాడట.ఇక ఈ మాటలను బట్టి ఇలియానా ఈ సినిమాను కావాలనే రిజెక్ట్ చేసిందని టాక్ వినిపించింది.

వెంకటేష్ వయసులో పెద్ద వాడని దాంతో తనకు మళ్లీ అవకాశాలు వస్తాయో రావో అన్న ఉద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు చేసిందని తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube