ఇక నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం లోనే రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.ఈ క్రమంలో ఎంపిక చేసిన 51 గ్రామ వార్డు సచివాలయాల్లో భూములు మరియు ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.
పారదర్శకత కోసమే గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ చేపట్టేబోతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.ఈ క్రమంలో గ్రామ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి.
ప్రత్యేక శిక్షణా కార్యక్రమం కూడా ఇస్తూ ఉంది.
ఈ రీతిగా భూములు మరియు ఆస్తుల రిజిస్ట్రేషన్ ల కార్యక్రమం చేయటంతో రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందట.
ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి అనేక పథకాలు మరియు రేషన్ కార్డు వంటి సేవలు.గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ప్రభుత్వం అందిస్తూ వస్తోంది.ఈ తరుణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా గ్రామ, వార్డు సచివాలయల ద్వారా అందిస్తే ఇక పూర్తిగా ప్రజలకి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ సేవలు మరింత అందించేలా బలోపేతం అయ్యేలా ఉంటుందని.ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.