బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది.
అయితే దీపికా పడుకునే మంచి స్పోర్ట్స్ ప్లేయర్ అని చాలా మందికి తెలీదు.అవును తాను మంచి స్పోర్ట్స్ ప్లేయర్.
సినిమాల్లోకి రాకముందు దీపికా పడుకునే మంచి షటిల్ ప్లేయర్.బ్యాడ్మింటన్ ఆమెకి కొత్తేమి కాదు.
బాగా వచ్చిన ఆటే.దీపికా తండ్రి ప్రకాష్ కూడా ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాళ్లలో ఒకరు.ఆయన ఈ గేమ్ లో ఎన్నో పతకాలు కూడా సాధించారు.దీపికా తండ్రి దగ్గరే ఆట నేర్చుకుంది.అయితే అనుకోకుండా సినిమాల్లోకి రావడంతో ఎక్కువగా గేమ్స్ మీద ద్రుష్టి పెట్టలేకపోయింది.టైం మొత్తం సినిమాలకే పెట్టాల్సి వచ్చేది.
దీంతో ఆటను పక్కన పెట్టింది.కానీ కొంచెం గ్యాప్ దొరికేనా, ఫ్రీగా ఉన్న దీపికా మాత్రం బ్యాట్ పెట్టుకుంటూనే ఉంటుంది.అయితే ఇప్పడు ఈ స్పోర్ట్స్ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.తాజాగా దీపికా ఒలింపిక్ విజేత పీవీ సింధుని కలిసింది.
వీరిద్దరూ కలిసి కొంచెం సేపు బ్యాడ్మింటన్ ఆడి ఛిల్ అయిన సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.ఆ వీడియోను, ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది.
ఈ వీడియో చూసినప్పుడు దీపికా ఇంత బాగా బ్యాడ్మింటన్ ఆడుతుందా అని అనకుండా మాత్రం ఉండలేరు.
సాధారణమైన రోజే పీవీ సింధుతో ఆడుతూ కెలరీలు కరిగించుకుంటున్నా అని క్యాప్షన్ పెట్టింది.దీనికి పీవీ సింధు తన ‘ఎన్ని కేలరీలు కరిగించావ్ అంటూ కామెంట్ చేసింది.దీపికాతో పాటు సింధు కూడా ఒక పోస్ట్ పెట్టింది.
వాళ్లిద్దరూ ఆడిన ఫోటోలను షేర్ చేస్తూమళ్లీ ఎప్పుడు ఆడదాం అంటూ దీపికను ప్రశ్నించింది.వీరిద్దరూ పెట్టిన పోస్టులు అభిమానులని ఆనందపరిచాయి.
వీరిద్దరూ ఆడిన గేమ్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.