అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కోసం డబ్బింగ్ చెబుతున్న పూజాహెగ్డే.

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు.

 Pooja Hegde Dubbing For Akhil Akkineni 'most Eligible Bachelor' , Tollywood , Po-TeluguStop.com

భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు.

తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కోసం డబ్బింగ్ చెబుతున్నారు పూజ హెగ్డే.తన సొంత గాత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు పూజా హెగ్డే.

తెలుగులో అద్భుతమైన స్పష్టతతో డబ్బింగ్ చెబుతున్నారు.

ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన ప్రతి అప్డేట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ మధ్యే విడుదలైన లెహరాయి పాటకు కూడా యూ ట్యూబ్ లో అనూహ్య స్పందన వస్తోంది.ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా ఉండేలా డిజైన్ చేస్తారు.

అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ ప్రత్యేకత వుంటుంది.ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు.

అక్టోబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

న‌టీ న‌టులు

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌ బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్ మ్యూజిక్: గోపీ సుంద‌ర్ సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube