చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీరావు( Ramoji Rao ) శనివారం ఉదయం తన చివరి శ్వాస విడిచారు.అయితే ఈ సందర్భంగా రామోజీరావు కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అలాగే ఆ ఆస్తులకు వారసులు ఎవరు అనే ఒక ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వందల వేల కోట్ల ఆస్తులును సంపాదించిన రామోజీ రావు ఎన్నో వ్యాపారాలను నడిపించారు.మీడియా, రిటైల్, చిట్ ఫండ్స్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ రంగంలో దిగ్గజ వ్యక్తిగా నిలిచారు.
మీడియా రంగంలో ఆయన స్థాపించిన ఈటీవీ( ETV ) ప్రస్తుతం భారతదేశంలో 13 భాషలలో ప్రసారం కాబడుతుంది.వీటితోపాటు ప్రియా ఫుడ్స్ మరియు పచ్చళ్ళు, మసాలా దినుసులు, హోటల్స్, ఎక్స్పోర్ట్, కళాంజలి షాపింగ్ మాల్, బ్రీసా వంటి గృహాలంకరణ వస్తు సామాగ్రి సంస్థ, కొలోరమా ప్రింటర్స్ అంటే అనేక సంస్థలని కూడా దిగ్విజయంగా నడిపించారు రామోజీరావు.
![Telugu Kiran Prabhakar, Margadarsichit, Ramoji, Ramoji Rao, Ramojirao, Suman Pra Telugu Kiran Prabhakar, Margadarsichit, Ramoji, Ramoji Rao, Ramojirao, Suman Pra](https://telugustop.com/wp-content/uploads/2024/06/Ramoji-rao-properties-and-detailssa.jpg)
కేవలం రామోజీ ఫిలిం సిటీ( Ramoji Film City ) మాత్రమే 2 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది.ప్రస్తుతం కోకాపేట భూముల ధరలను బట్టి చూస్తే ఈ ఒక రామోజీ ఫిలిం సిటీ ఆస్తి 1,20 వేల కోట్ల రూపాయలను అని తెలుస్తోంది.అలాగే రామోజీ రావు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఉన్నారు.ఉషా కిరణ్ మూవీస్( Usha Kiran Movies ) తరఫున 80 చిత్రాలకు నిర్మాతగా ఉన్నారు.
![Telugu Kiran Prabhakar, Margadarsichit, Ramoji, Ramoji Rao, Ramojirao, Suman Pra Telugu Kiran Prabhakar, Margadarsichit, Ramoji, Ramoji Rao, Ramojirao, Suman Pra](https://telugustop.com/wp-content/uploads/2024/06/Ramoji-rao-properties-and-detailsd.jpg)
ఒక మార్గదర్శి చిట్ ఫండ్స్( Margadarsi Chit Funds ) గురించి అందరికీ తెలిసిందే.దీనికి సంబంధించిన 793 కోట్ల రూపాయల ఆస్తులను జగన్ ప్రభుత్వం అటాచ్ చేసిన విషయంలో ఎన్నో పోరాటాలు కూడా జరిగాయి.ఇలా ఆయన ఆస్తుల లెక్క చూస్తూ వెళితే ఐదు బిలియన్ల డాలర్లు గా తేలుతుంది.
![Telugu Kiran Prabhakar, Margadarsichit, Ramoji, Ramoji Rao, Ramojirao, Suman Pra Telugu Kiran Prabhakar, Margadarsichit, Ramoji, Ramoji Rao, Ramojirao, Suman Pra](https://telugustop.com/wp-content/uploads/2024/06/Ramoji-rao-properties-and-detailsa.jpg)
రామోజీ రావు వారసుల విషయానికొస్తే ఆయనకు ఇద్దరు కుమారులు కాగా మొదటి కుమారుని పేరు కిరణ్ ప్రభాకర్( Kiran Prabhakar ) అలాగే రెండవ కుమారుని పేరు సుమన్ ప్రభాకర్.( Suman Prabhakar ) సుమన్ 2012లో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.కిరణ్ కి ముగ్గురు కూతుర్లు కాగా సుమన్ కి ఒక కొడుకు ఒక కుమార్తె ఉన్నారు.
అలాగే కిరణ్ ఈనాడు సంస్థలకి మానేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా కిరణ్ సతిమణి శైలజ మార్గదర్శి చిట్ ఫండ్స్ కి ఎండీ గా వ్యవహరిస్తున్నారు.ఇక రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన అన్ని బాధ్యతలను సుమన్ సతీమణి చూస్తుండగా, కిరణ్ రెండవ కుమార్తె ఈటీవీ భారత్ కి ఎండిగా పనిచేస్తున్నారు.