రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు( Ramoji Rao ) మరణం పట్ల చాలామంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసుకున్నారు.ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు.
ఆ తర్వాత రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.
రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించింది అని తెలిపారు.ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నా.
కానీ ఇంతలోనే దురదృష్టవశాత్తు కన్నుమూశారు.తెలుగు రాష్ట్రాలలో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్( Eenadu Journalism School ) నుంచి వచ్చిన వారే.
ఎంతోమంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు ఆయన.గత 15 ఏళ్లలో ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెట్టాయి.ఆయనని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు.ఆ విషయం ఆయనకు తెలియజేయాలి అనుకున్నా.ప్రమాణ స్వీకారం తర్వాత కలుద్దాం అనుకున్న లోపే.ఇలా జరిగిపోయింది అంటూ పవన్ విచారం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ నివాళులు అర్పించడం జరిగింది.ఇదిలా ఉంటే రామోజీరావు మృతికి నివాళిగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది.
రేపు రామోజీ ఫిలిం సిటీలో( Ramoji Film City ) అంత్యక్రియలు జరగనున్నాయి.తెలంగాణ ప్రభుత్వం అధికార లాంచనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించనుంది.