టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులే లేరు.ఎందుకంటే ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకే మెగాస్టార్ గా నిలిచాడు.
ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలలో దూసుకుపోతున్నాడు.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఈయన నటుడిగా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో.వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇలా ఉంటే ఈయనను అల్లు రామలింగయ్య అల్లుడిగా ఎందుకు చేసుకున్నాడో తెలుసా.
సినీ నటుడు అల్లు రామలింగయ్య కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈయనకు అల్లు అరవింద్, సురేఖ అనే ఇద్దరు పిల్లలు ఉండగా అందులో సురేఖను మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చి 1980లో పెళ్లి చేశాడు.చిరంజీవి డైనమిక్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే సురేఖను పెళ్లి చేసుకున్నాడు.
ఇక రామలింగయ్య చిరంజీవినే అల్లుడిగా చేసుకోవడానికి ఓ కారణం ఉంది.చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ హీరోగా నిలవడానికి కష్టపడ్డ తీరును చూసి అంతేకాకుండా నటన పట్ల ఎంతో తపన చూయించి ఎదగడంతో అల్లు రామలింగయ్య చిరంజీవిని చూసి ఆకర్షితులవడంతో వెంటనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడట.
అలా కొణిదెల కుటుంబానికి అల్లు కుటుంబానికి బంధుత్వం కుదిరింది.ఇక సురేఖ అండ చిరంజీవికి ఎక్కువగా ఉండటం వల్ల ఆయన చాలా గుర్తింపులు సొంతం చేసుకున్నాడు.చిరంజీవికి ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.ఇక చిరంజీవి రాజకీయంలో అడుగుపెట్టినప్పుడు కూడా తన భార్య సురేఖ కూడా తనకు చాలా ధైర్యం ఇచ్చిందట.
చాలా సార్లు చిరంజీవి తన భార్య సురేఖ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు.
ఇక వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉండగా తన కుమారుడు రామ్ చరణ్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.రామ్ చరణ్ తో కలిసి పలు సినిమాలలో కూడా నటించాడు చిరంజీవి.ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలో చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి మరోసారి నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ సినిమా మలయాళంలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ సినిమాను చేయడానికి చిరంజీవి ముందుకు వచ్చాడు.ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా అనుకున్నారు.
అంతేకాకుండా తమిళంలో మంచి సక్సెస్ అందుకున్న వేదాళమ్ రీమేక్ లో కూడా నటించనున్నాడు చిరు.ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడు.ఇటీవలే ఈ సినిమాకు బోలా శంకర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.ఇవే కాకుండా బాబి దర్శకత్వంలో కూడా మరో సినిమా ఫిక్స్ చేశాడు.ఆ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాగా ఈ సినిమాకు వీరయ్య అనే పేరును పెట్టారు.
కానీ ఈ సినిమా టైటిల్ చిరుకి నచ్చకపోవడంతో టైటిల్ ను మార్చే పనిలో ఉన్నారు సినీ బృందం.