ప్రకాష్ రాజ్. మన అందరికి తెలిసిన విలక్షణ నటుడు.
దాదాపు అన్ని భాషల్లో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఒక్క నటుడిగా అయన ప్రయాణం ఆగిపోలేదు.
దర్శకుడిగా, నిర్మాతగా తనలోని ప్రతిభకు సాన పెట్టాడు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రకాష్ రాజ్ వంటి నటుడు లేడు అంటే అది అతిశయోక్తి కాదు.
కాంచీవరం అనే సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా ప్రకాష్ రాజ్ నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.ఈ చిత్రాన్ని ప్రియదర్శన్ రూపొందించాడు.
ప్రకాష్ రాజ్ నిజానికి ఒక కన్నడ వ్యక్తి.అయినప్పటికీ బహుభాషా చిత్రాల్లో నటిస్తూ, ఆ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు.
అయన కెరీర్ విషయాలను కాసేపు పక్కన పెడితే వ్యక్తి గత జీవితం చాల ఒడిడుకులు గురయ్యింది.ఒక అనాధ కడుపునా పుట్టాడు.ఎంతో కష్ట పడి పెరిగాడు.సినిమాల్లో నటిస్తున్న క్రమం లో తనతో పాటే నటిస్తున్న లలిత కుమారి అనే మహిళా తో ప్రేమలో పడి 1994 లో పెళ్లి కూడా చేసుకున్నాడు.
ఈ లలిత కుమారి మరెవరో కాదు మన తెలుగు నటుడు అయినా శ్రీహరి భార్య డిస్కో శాంతి కి స్వయంఉ చెల్లెలు. అంటే శ్రీహరి, ప్రకాష్ రాజ్ తోడల్లుళ్లు.
ప్రకాష్ రాజ్ కి, లలిత కుమారి దంపతులకు ఇద్దరు కూతుళ్లు మరియు ఒక కుమారుడు సంతానం కలిగింది.వీరి కుమారుడు పేరు సిద్దు.
అతడికి నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు , మేడ పైన గాలిపటం ఎగరవేయబోయి కాలు జారీ కింద పడి కొన్నాళ్ల తర్వాత గాయాల తీవ్రత ఎక్కువ కావడం తో మరణించాడు.
అప్పటి వరకు సజావుగానే సాగిన ప్రకాష్ రాజ్, లలిత ల కాపురం బీటలు వారడం మొదలయ్యింది.సిద్దు మరణానికి లలిత కుమారి అజాగ్రతే కారణం అని ప్రకాష్ రాజ్ బలంగా నమ్మడం తో ఇద్దరి మధ్య అనేక గొడవలు జరిగాయి.శ్రీహరి, డిస్కో శాంతి లు ఇద్దరు ఎన్ని సార్లు చెప్పిన ప్రకాష్ రాజ్ వినలేదు.
ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని శ్రీహరి చాల ప్రయత్నాలు చేసినప్పటి గొడవలు మరింత పెరగడం తో ప్రకాష్ రాజ్ విడాకుల కోసం పట్టు బట్టాడు.అలా 2009 లో వీరికి కోర్ట్ విడాకులు మంజూరు చేసింది.
ఇక ఆ గ్యాప్ లో ప్రకాష్ రాజ్ కి పోనీ వర్మ అనే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ తో పరిచయం కావడం, వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం చక చక జరిగిపోయాయి.లలిత కు విడాకులు ఇచ్చిన ఏడాది లోపే పోనీ వర్మ ను పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు ప్రకాష్ రాజ్.ప్రస్తుతం ఈ జంటకు వేదాంత్ అనే కొడుకు ఉన్నాడు.