అనసూయ భరద్వాజ్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
బుల్లితెర యాంకర్ గా అడుగుపెట్టిన అనసూయ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకున్నారు.రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ఇక వెండితెరపై వరుస అవకాశాలు దక్కించుకుంటూ తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా అనసూయ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా అనసూయ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు తీవ్ర విమర్శలకు కారణమవుతుంటాయి.
ముఖ్యంగా ఈమె షేర్ చేసే ఫోటోలలో ఈమె వస్త్రధారణ గురించి నెటిజనులు ఎన్ని విమర్శలు చేస్తున్న వాటి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా నిత్యం తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఇక సోషల్ మీడియా వేదికగా తన గురించే నెగిటివ్ మాట్లాడే వారిపై ఘాటుగా స్పందించి వారికి సరైన రీతిలో సమాధానం చెబుతుంది.
ఇలా, కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా మహిళలను ఉద్దేశించి వారు పడే బాధ, ఎదుర్కొనే సమస్యలను గురించి వివరించారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో మహిళలు ఎదుర్కొనే సమస్యలను గురించి వివరించింది.మహిళలు తమ కారులో, బాత్రూంలో, బెడ్ రూమ్ లో వారిపై కలుగుతున్నటువంటి ఒత్తిడిని భరించలేక ఎన్నిసార్లు ఏడుస్తారో తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.వారికి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎవ్వరికీ చెప్పకుండా బయటకు నవ్వుతూ కనబడుతూ వారి పనులకు వెళ్తుంటారు.
లోపల ఎన్ని బాధలు ఉన్న చిరునవ్వుతో ఆఫీసుకు వెళుతుంది.తన ఇతర పనులను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది అంటూ మహిళలు పడే బాధలు గురించి వివరిస్తూ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.