పూర్తిగా మారిపోయిన హీరో రామ్.. అహర్నిశలు కష్టపడి ఇలా?

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించడానికి కంటే ముందుగా ఎనర్జిటిక్ స్టార్ గా, లవర్ బాయ్ గా ఎంతో మంది అమ్మాయిలను ఆకట్టుకున్న రామ్ పోతినేని, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలో ఉన్న మరొక యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించారు.

 Hero Ram Pothineni Completely Changed Lots Of Hard Work, Tollywood, Hero, Ram, H-TeluguStop.com

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ తన మాస్ యాంగిల్ తో ప్రేక్షకులను బాగా సందడి చేశారు.ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలకు ముందు వరకు ఎనర్జిటిక్ స్టార్ గా ఉన్నటువంటి ఈయన ఆ తర్వాత ఉస్తాద్ రామ్ గా మారిపోయారు.

చాలా సంవత్సరాల నుంచి ఒక్క హిట్ కూడా లేనటువంటి రామ్ కి ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అందించిందని చెప్పవచ్చు.ఈ సినిమా తర్వాత అదే మాస్ లుక్ లో రెడ్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయినప్పటికీ ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.ఇందులో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు.

Telugu Change, Haardwork, Krithi Shetty, Ismart Shankar, Ram Lingusamy, Rampothi

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్న రామ్ తన శరీర ఫిట్ నెస్ కోసం పూర్తిగా కష్టపడుతున్న తెలుస్తోంది.తాజాగా రామ్ పోతినేని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే మెలి తిరిగిన కండలతో బల్లాల దేవుడికి అన్నగా అన్నట్టు తన లుక్ మొత్తం మార్చేశాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు రామ్ లుక్ చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నారు.ప్రతి ఒక్క సినిమాకు తనని తాను మార్చుకుంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్న రామ్ ను చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం రామ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube