సినిమా రంగం మాయలో పడిన వారు.అందులో నుంచి బయటకు రావాలంటే అంత ఈజీ కాదు.
ఎన్ని కష్టాలు ఎదురైనా ఫర్వాలేదు.కానీ సినిమా చేయాలి అనే కసి కొందరిలో ఉంటుంది.
అనుకున్నది సాధించేందుకు ఎన్ని బాధలైనా భరించేందుకు రెడీగా ఉంటారు.అవకాశం తప్పకుండా వస్తుంది అనే హోప్ తోనే ముందుకు సాగుతారు.
అలా కష్టాల కడలి నుంచి వచ్చిన వాడే సుజీత్.రన్ రాజా రన్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టాడు ఈ యువ డైరెక్టర్.
ఈ సినిమా విజయంతో పాన్ ఇండియన్ మూవీ సాహోలో అవకాశం దక్కించుకున్నాడు.బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన మూవీ ఇది.ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోయినా.సుజీత్ కు మంచి పేరు తెచ్చింది.
తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయన కెరీర్ ప్రారంభం దశలో ఎదురైన కష్టాలను పూసగుచ్చినట్లు వివరించాడు.
సినిమా అవకాశాల కోసం ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టు తిరిగాడు సుజీత్.
ఓ మంచి లవ్ స్టోరీ రాసుకుని పలువురు నిర్మాతల దగ్గరకు తీసుకెళ్లాడు.ఈ సినిమా తొలి హాఫ్ బాగా నచ్చింది.
రెండో భాగం కోసం 5 నెలల పాటు రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి రాశాడు.చివరకు ఓ సినిమా ప్రొడక్షన్ హౌస్ కు వెళ్లి సెకెండ్ ఆఫ్ స్టోరీ వినిపించాడు.
వాళ్లకు సినిమా కథ చాలా నచ్చింది.తన ప్రాజెక్టు ఓకే అవుతుందనుకున్నాడు.
బండిపై తన రూమ్ కు బయల్దేరాడు.కాసేపటికే ఫోన్ వచ్చింది.
సినిమా ఆఫీస్ నుంచి కాల్.చూడండీ.
ఈ సినిమాకు బడ్జెట్ చాలా ఎక్కువ అయ్యేలా ఉంది.
వేరే కథ ఉంటే చెప్పు అనే మాట వినిపించింది అవతలి నుంచి.ఒక్కసారి తీవ్ర నిరాశకు లోనయ్యాడు.అప్పుడే వర్షం కూడా వస్తుంది.
అక్కడే రోడ్డు పక్కన కూర్చుని కసిగా ఏడ్చాడు.అప్పుడే వెన్నెల కిశోర్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
అతడు సుజీత్ కు ధైర్యం చెప్పాడు.ఒక్క రోజులో సినిమా స్టోరీ రాయగలవు అనే ధైర్యం చెప్పాడు.
అతడి మాటలు విని సంతోషం వేసింది.అక్కడి నుంచి లేశాను.
బండ్లో పెట్రోల్ అయిపోయింది.చేతిలో పైసా లేదు.
బండిని నెట్టుకుంటూ ముషీరాబాద్ వరకు వెళ్లాడు.
ఇంటికి వెళ్లి కాస్త రిలాక్స్ అయ్యాడు.వెంటనే తను చాలా కాలం నుంచి రాస్తున్న రన్ రాజా రన్ కథ గుర్తుకు వచ్చింది.వెంటనే సినిమా ఆఫీస్ కు ఫోన్ చేసి ఈ కథ గురించి చెప్పాడు.
మూడు రోజుల తర్వాత సినిమా ఆఫీస్ కు వెళ్లి కథ చెప్పాడు.ఒక్క సీన్ కూడా మార్చకుండా ఓకే చెప్పారు.
సినిమా తీశాడు.హిట్ కొట్టాడు.