టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మండిపడ్డారు.కావాలని పొలిటికల్ మైలేజీ కోసం ప్రతి విషయాన్ని నారా లోకేష్.
రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.అత్యాచారానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడో స్పందించడం జరిగింది అని.కానీ ఆ విషయాన్ని రాద్ధాంతం చేయడానికి జరిగి ఎన్నో నెలలైనా ఘటనపై లోకేష్ పరామర్శ కి వెళ్లడం ఏంటి అంటూ ప్రశ్నించారు.
ఇక ఇదే తరుణంలో ఆడబిడ్డలకు ఎంతో రక్షణగా నిలిచే దిశ చట్టాన్ని అమలు కాకుండా అడ్డుకుంటున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు అని మండిపడ్డారు.
ఇక ఇదే తరుణంలో ఇదే విషయంపై నిన్న లోకేష్ పర్యటన పై వైసీపీ మంత్రి కన్నబాబు కూడా సెటైర్లు వేశారు.దాదాపు ఏడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనపై అది కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఘటనపై నారా లోకేష్ నానా యాగీ చేయడం.
పార్టీలో ఉనికి చాటు కోవడం కోసమే అంటూ విమర్శించారు.పొలిటికల్ మైలేజీ కోసం నారా లోకేష్.నరసరావు పర్యటన చేపట్టారని మండిపడ్డారు.