టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెసెంట్ చేస్తున్న సినిమా సర్కారు వారి పాట.పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ మధ్యనే ఈ సినిమా నుండి టీజర్ విడుదల అయ్యింది.మహేష్ ఈ సినిమాలో మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.
అంతేకాదు ఈ టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది మహేష్ రోల్ ఎంత ఎనర్జిటిక్ గా ఉందొ.ఇందులో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.
తాజాగా ఈ సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా కూడా సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టు టాక్.మహేష్ ఇంతకు ముందు చేసిన మహర్షి, సరిలేరు నీకెవ్వరూ సినిమాలు కూడా మంచి మెసేజ్ అందించాయి.ఇక ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని తెలుస్తుంది.ఇది కమర్షియల్ అంశాలతో పాటు సందేశం కూడా అందించే చిత్రం అని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ చుస్తే తెలుస్తుంది.
ఈ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి చూపించ బోతున్నారని తెలుస్తుంది.
అంతేకాదు ఆర్ధిక నేరాలకు పాల్పడే అందరిని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడట.అంతేకాదు ఈ సినిమాలో కూడా ప్రెస్ మీట్ ఉంటుందట.ఇంతకు ముందు భరత్ అనే నేను, మహర్షి వంటి సినిమాల్లో ఈ ప్రెస్ మీట్స్ బాగా హిట్ అయ్యాయి.ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక ప్రెస్ మీట్ ఉంటుందని తాజా సమాచారం.
ఈ ప్రెస్ మీట్ లో మహేష్ డైలాగ్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయట.అంతేకాదు ఈ ప్రెస్ మీట్ సీన్ సుదీర్ఘంగా సాగుతుందని టాక్ వినిపిస్తుంది.మొత్తానికి మహేష్ ఈసారి కూడా మంచి మెసెజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను వచ్చే ఏడాది 2022 జనవరి 13 న విడుదల చేయబోతున్నారు.