ఇంటర్నేషనల్ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి, ఆయన ఆట గురించి క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే.ఈయనకు భారతదేశంలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఈయన గ్రౌండ్ లోకి అడుగు పెడితే చాలు స్టేడియంతో పాటు మ్యాచ్ చూస్తున్న అభిమానులు కూడా ఆయన ఆట తీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఈయనకు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలలో కూడా అభిమానులు ఉన్నారు.
ఇక కొందరు మాత్రం ఈయన పోస్టర్లతో ఇల్లంతా నింపుతారు.ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ కూడా విరాట్ ను పిచ్చి పిచ్చిగా ప్రేమించాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇక విరాట్ కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఈయనను మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా పిచ్చి పిచ్చిగా ప్రేమించిందట.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మృణాల్ ఠాకూర్.పలు సినిమాలలో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా.మరో క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో కూడా నటిస్తుంది.
తెలుగులో క్రికెట్ నేపథ్యంలో విడుదలైన జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేయగా అందులో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక ఇందులో నటిస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది.విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని.
ఒకప్పుడు విరాట్ ను పిచ్చి పిచ్చిగా ప్రేమించానని తెలిపింది.తన సోదరుడు క్రికెట్ చూస్తున్న సమయంలో తాను కూడా క్రికెట్ చూడటం మొదలు పెట్టానని.
ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఆటను చూసి మనసు పారేసుకున్నాను అని తెలిపింది.
ఇక ఐదేళ్ల క్రితం ఓ స్టేడియంలో విరాట్ తో కలిసి తను మ్యాచ్ చూశానని.అందులో ఆ రోజు తాను నీలిరంగు జెర్సీ ధరించి చీర్స్ చేసినటువంటి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను అని తెలిపింది.ఇక ప్రస్తుతం తాను నటిస్తున్న క్రికెట్ నేపథ్యం సినిమాలో కూడా భాగం కావడం సంతోషమని తెలిపింది.