పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు సినీ రాజకీయ ప్రముఖుల నుండి అలాగే అభిమానుల నుండి పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుతున్నాయి.
మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో సందడి బాగా చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించాడు.
సోషల్ మీడియా ద్వారా చిరు తన తమ్ముడికి ప్రత్యేకంగా పుట్టిన రోజు విషెష్ తెలిపాడు.చిన్నప్పటి నుండి అతని ప్రతి ఆలోచన.ప్రతి అడుగు సమాజంలో పది మందికి మేలు జరగాలని అను క్షణం కోరుకునే వ్యక్తి పవన్ అందుకోసం ఎప్పుడు పరితపించే నిప్పు కణం పవన్ కళ్యాణ్.అతడు కోరుకున్న లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చిరు పోస్ట్ పెట్టాడు.
చిరంజీవి విషెస్ తెలపడంతో పవర్ స్టార్ అభిమానులు మరింత సంబర పడుతున్నారు.
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే పవన్ ప్రెసెంట్ నటిస్తున్న చిత్రాల్లో ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే మలయాళ రీమేక్ సినిమా కూడా ఉంది.ఈ సినిమాను భీమ్లా నాయక్ పేరుతొ తెలుగులో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.ఇందులో రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఈ సినిమాల అప్డేట్ లు కోసం ఎదురు చూస్తున్నారు.