ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జగన్ ట్రెండ్ సెట్టర్‌గా మారిపోయారు.ఆయన ఏది చేస్తే అది మిగతా పార్టీలు ఫాలో కావాల్సిందే అన్నట్టు ఆయన రాజకీయాల్ని నడిపిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఏపీలో మొన్నటి వరకు కేవలం టీడీపీనే తన ప్రతిపక్షంగా భావిస్తున్న జగన్ త్వరలోనే బీజేపీ అలాగే జనసేన కలిసి తనకు ప్రతిపక్షంగా మారే ప్రమాదం ఉందని గ్రహిస్తున్నారు.అందుకే ఆయన వాటిని ఎదుర్కునేందుక పక్కా ప్లాన్ ఆలోచిస్తున్నారు.
ఇందు కోసం ఆయన ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే చాలా రోజుల నుంచి ఓ మాట వినిపిస్తోంది.
అదేంటంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? అనే కోణంలో చర్చ సాగుతోంది.అదే గనక జరిగితే పట్టే లేని టీడీపీ నిండా మునగడం ఖాయమని అంతా అంటున్నారు.
ఎందుకంటే ఇప్పటికీ ఆ పార్టీ ఓడిపోయిన స్థానాల్లో నిలదొక్కు కునే ప్రయత్నాలు కూడా పెద్దగా చేయట్లేదు.ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా జమిలి ఎన్నికలకు ప్రణాళికలు రూపొందిస్తున్న సమయంలో టీడీపీలో టెన్షన్ పెరుగుతోంది.
ఇక ఏపీలో భారీ ఎత్తున పార్టీలో మహిళలకు పదువులు కూడా కట్టబెడుతున్నారు.కానీ ఇక్కడే అసలు విషయం ఏంటంటే కేంద్రం జమిలి ఎన్నికలను జరిపేందుకు రెడీగా లేదనే సంకేతాలు వినిపిస్తున్నాయి.కానీ జగన్ ప్రభుత్వమే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతోందంట.
ప్రజల్లో ఇప్పుడు తమకు ఉన్న ఆదరణను అవకాశంగా మలుచుకుని మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారంట.అదే జరిగితే అసలు టీడీపీ ఇప్పటికిప్పుడు ఓడిపోయిన స్థానాల్లో ఏమోగాని గెలిచిన స్థానాల్లో కూడా మల్లీ గెలుస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఎందుకంటే కనీసం 46 నియోజకవర్గాల్లో టీడీపీని నడిపించే నాయకుడే లేడు.